- Telugu News Photo Gallery Cinema photos Kannappa Movie Team Visits Somnath And Nageshwar Jyotirlingam Temples, Photos Here
Kannappa: 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో మంచు విష్ణు ‘కన్నప్ప’ టీమ్.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్టు కొన్ని కారణాలతో వాయిదా పడింది. కాగా కన్నప్ప సినిమా విడుదలకు ముందు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నట్లు మంచు విష్ణు ఇది వరకే ప్రకటించాడు.
Updated on: Feb 02, 2025 | 9:52 PM

కన్నప్ప సినిమా విడుదలకు ముందు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నట్లు ఇది వరకే వెల్లడించాడు హీరో విష్ణు. ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ దర్శించుకుంది.

అలాగే బద్రీనాథ్, రిషికేశ్‌లను కూడా సందర్శించారు. మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు చిత్ర బృందం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.

తాజాగా సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను కన్నప్ప టీమ్ సందర్శించింది. మోహన్‌బాబు, విష్ణు, శరత్‌కుమార్‌లతో పాటు పలువురు చిత్ర బృందం సభ్యులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కన్నప్ప టీమ్ యాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఏప్రిల్ 25న కన్నప్ప పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది

మహా భారతం సీరియల్ ఫేమ్, బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.





























