- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Thandel to Vishwak Sen Laila latest movie updates from film industry
Movie Updates: గ్రాండ్‌గా తండేల్ ఈవెంట్.. లైలా నుంచి కొత్త పాట..
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. విక్కీ కౌషల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ఛావా. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్. తన నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్. ఇలాంటి సినిమా అప్డేట్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Feb 03, 2025 | 10:25 AM


విక్కీ కౌషల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ఛావా. ఫిబ్రవరి 14న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కాలి గాయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రెస్‌మీట్స్‌లో పాల్గొంటున్నారు రష్మిక మందన్న.

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఓహో రత్తమ్మ అంటూ సాగే ఈ పాటను పెంచల్ దాస్, మధుప్రియ ఆలపించారు. లియోన్ జేమ్స్ సంగీతమందించారు.

ఇటీవల కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ 16 షూటింగ్‌లో జాయిన్ అయ్యారు చెర్రీ. ఇప్పటికే మైసూర్‌లో, హైదరాబాద్‌లో కొంత షూట్ పూర్తి చేసింది చిత్రయూనిట్.

తన నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్. థగ్ లైఫ్ తరువాత విక్రమ్ 2ను పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్, కొత్త కథను సిద్ధం చేసినట్టుగా వెల్లడించారు. దీంతో విక్రమ్ 2 ఇప్పట్లో ఉండదన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు కమల్.





























