AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Putrudu Movie: మెంటెలెక్కిస్తోన్న దేవి పుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇలా అస్సలు ఊహించలేదుగా.. ?

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో దేవి పుత్రుడు ఒకటి. డైరెక్టర్ కోడి రామకృష్ణ తరెకెక్కించిన ఈ సినిమాలో దివంగత హీరోయిన్ సౌందర్య, నరేష్ కీలకపాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అంజలా జవేరి ముఖ్య పాత్రలో కనిపించింది.

Devi Putrudu Movie: మెంటెలెక్కిస్తోన్న దేవి పుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇలా అస్సలు ఊహించలేదుగా.. ?
Devi Putrudu
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2025 | 4:28 PM

Share

దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ రూపొందించిన అద్భుతమైన సినిమాల్లో దేవి పుత్రుడు ఒకటి. విక్టరీ వెంకటేశ్, దివంగత హీరోయిన్ సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో నరేష్, అంజలా జవేరి, కోట శ్రీనివాస్ రావు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం మరో హైలెట్. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాట ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. కేవలం ఈ పాటకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ కనిపించిన చిన్నారికి సైతం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దేవి పుత్రుడు సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ మళ్లీ కనిపించలేదు.

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వేగా తమోటియా. 1985లో జన్మించిన ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో హౌస్ ఫుల్ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. తెలుగు యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ అంతగా ఫేమస్ కాలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఇక తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యింది. చదువులు పూర్తి చేసిన వేగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దేవి పుత్రుడు సినిమాలో బొద్దుగా క్యూట్ గా కనిపించిన వేగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా కనిపిస్తుంది.

Vega Tamotia

Vega Tamotia

View this post on Instagram

A post shared by Vega Tamotia (@vegatamotia)

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్