AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ఆర్‌సీ 16 కోసం 20 ఏళ్లు వెనక్కి.. హాలీవుడ్ స్టైల్‌లో రామ్ చరణ్, జాన్వీల సినిమా

గేమ్‌ ఛేంజర్ రిలీజ్ కాకముందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ను ప్రకటించాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అతను ఓ క్రేజీ సినిమాలో నటిస్త్ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా హాలీవుడ్‌లో ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న చిత్రాల్లో ఉపయోగించిన టెక్నాలజీనే ఈ సినిమాలో కూడా వాడుతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లు ప్రయోగాలు మొదలుపెట్టారు.

Ram Charan: ఆర్‌సీ 16 కోసం 20 ఏళ్లు వెనక్కి.. హాలీవుడ్ స్టైల్‌లో రామ్ చరణ్, జాన్వీల సినిమా
Ram Charan, Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Feb 02, 2025 | 4:05 PM

Share

గేమ్ ఛేంజర్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. గతంలో ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మున్నాభాయ్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్ తరహాలోనే ఆర్ సీ 16 సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే హాలీవుడ్ తరహాలో కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. 2023లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘ఓపెన్‌హైమర్’లో ఉపయోగించిన కొన్ని సాంకేతికతలను రామ్ చరణ్-శివన్నల సినిమాలోనూ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నెగటివ్ రీల్‌తో ‘ఓపెన్‌హైమర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఉత్తమ నాణ్యమైన ఫుటేజీని క్యాప్చర్ చేసింది. ‘ఓపెన్‌హైమర్‌’ సినిమా అద్భుతమైన క్వాలిటీ రావడానికి ఈ ప్రయోగమే కారణం. ఇప్పుడు ఆర్సీ 16 సినిమాకు కూడా అదే ప్రయోగం చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘దేవర’ ఖైదీ నెంబర్ 150, నేనొక్కడినే ‘ఆర్య’, ‘రోబో’, ‘రంగస్థలం’, సైరా, సరిలేరు నీకెవ్వరు, భారతీయుడు 2 తదితర సూపర్ హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రత్నవేలు ఆర్‌సి 16 చిత్రానికి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నెగెటివ్ ఫిల్మ్‌ని ఉపయోగించి రామ్ చరణ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రత్నవేలు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే కొడాక్‌తో చర్చలు జరిపాడు. రత్నవేలు ప్రయోగానికి కొడియాక్ ఇనిస్టిట్యూట్ సహాయం చేయనుంది. ‘ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్ మయం అయింది. హాలీవుడ్ మళ్లీ నెగిటివ్ వినియోగించి సినిమా చిత్రీకరణలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నెగెటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం తేలికైన విషయం కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే.. నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు’ అని రత్నవేలు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా మైసూరులో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జరుగుతోంది. శివన్న త్వరలో చిత్ర బృందంలో చేరనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!