Tollywood: స్కూల్ ఫంక్షన్‌లో స్టార్ కిడ్స్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో పిల్లలు.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? వీరు టాలీవుడ్ లో బాగా ఫేమస్. చిన్న వయసే అయినప్పటికీ హీరో, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ స్టార్ కిడ్స్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరు స్టార్ కిడ్స్ గా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయాన్, అర్హల గురించి ఏ విషయమైనా సోషల్ మీడియలో షేర్ చేస్తుంటుంది అల్లు స్నేహా రెడ్డి. తాజాగా తన పిల్లలకు సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది స్నేహ. ఈ వీడియోలో అర్హ, అయాన్ లిద్దరూ క్యూట్ గెటప్‌లో కనిపించారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి ఎంతో హుషారుగా, ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారు. తమ స్కూల్ ఈవెంట్‌లో నే అర్హ, అయాన్ ఇలా డిపరెంట్ గెటప్పులతో డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అర్హ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అయాన్ కూడా చాలా అల్లరి చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. చూసిన వారందరూ క్యూట్ కిడ్స్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్నాడు. గతేడాది డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ.1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. సునీల్, జగపతిబాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది.
ఫ్యామిలీతో అల్లు అర్జున్..
View this post on Instagram
ఇక అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తికేయుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దీంతో సహజంగానే ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.