- Telugu News Photo Gallery Cricket photos Suresh Raina Visits Mahakumbh Mela with his wife and family, Photos here
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా క్రికెటర్.. గంగలో పవిత్ర స్నానం.. ఫొటోస్ ఇదిగో
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మహా కుంభమేళాలో సందడి చేశాడు.
Updated on: Jan 31, 2025 | 9:31 PM

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తన సతీమణి ప్రియాంక చౌదరి రైనాతో కలిసి మహా కుంభ మేళాలో పాల్గొన్నాడు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.

అనంతరం రైనా దంపతులు స్వామి కైలాషానందగిరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ చుట్టు పక్కలనున్న పర్యాటక ప్రాంతాల్లో కలియ తిరిగారు రైనా దంపతులు.

తన మహా కుంభమేళా పర్యటనకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు రైనా. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

అలాగే దిగ్గజ బాక్సర్, ఒలంపిక్ విజేత ఎంసీ మేరీకోమ్ కూడా మహా కుంభమేళాలో సందడి చేశారు. గంగలో పవిత్ర స్నానం ఆచరించారు.

మహా కుంభమేళాకు మొదటిసారి హాజరైన మేరీకోమ్ భక్తుల స్నానాల కోసం ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది.




