AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫ్యామిలీని ఎదురించి సినిమాల్లోకి.. రొమాంటిక్ సీన్లతో సంచలనం.. 22 ఏళ్ల కెరీర్‏లో రెండే హిట్లు..

సాధారణంగా అమ్మాయిలు సినీరంగంలోకి వస్తామంటే వద్దని అడ్డుచెప్పే ఫేరెంట్స్ చాలా మంది ఉంటారు. అయినప్పటికీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కేవలం ఆమె ఖాతాలో రెండు హిట్స్ మాత్రమే వచ్చాయి. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఫ్యామిలీని ఎదురించి సినిమాల్లోకి.. రొమాంటిక్ సీన్లతో సంచలనం.. 22 ఏళ్ల కెరీర్‏లో రెండే హిట్లు..
Mallika Sherawath
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2025 | 3:18 PM

Share

ఒకప్పుడు బాలీవుడ్ సినీ ప్రపంచంలో ఆమె ఫేమస్. ముఖ్యంగా అప్పట్లో రొమాంటిక్ చిత్రాలు, సాంగ్స్‏లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఆమె పేరు మారుమోగింది. కుటుంబం వ్యతిరేకించినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్ లో బోల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు అప్పట్లో ఆమె కుర్రాళ్ల ఫేవరేట్. కానీ తన 22 ఏళ్ల కెరీర్ లో కేవలం 2 హిట్స్ మాత్రమే అందుకుంది. అయినప్పటికీ ఆమె ఆస్తులు వివరాలు తెలిస్తే మైండ్ బ్లాంకే. ప్రస్తుతం ఆమె క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్.

సినిమాల్లోకి వెళ్తానని చెప్పగానే తల్లిదండ్రులు వద్దన్నారు. దీంతో ఫ్యామిలీని వదిలి ముంబై చేరుకుంది. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. మల్లికా షెరావత్… అసలు పేరు రీమా లాంబా. ‘జీనా సిర్ఫ్ మేరే లియే’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత 2004లో వచ్చిన మర్డర్ మూవీతో మరింత పాపులర్ అయ్యింది. రూ.5 కోట్లతో నిర్మించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22.50 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ బ్యూటీకి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ తర్వాత వెల్ కమ్ మూవీతో మరో హిట్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

దాదాపు రెండు దశాబ్దాల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అప్పట్లో మల్లికా ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ చిత్రాల్లోనే నటించి పాపులర్ అయ్యింది. కానీ 22 ఏళ్ల సినీప్రయాణంలో కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ప్రస్తుతం మల్లికా ఆస్తులు రూ.174 కోట్లు అని సమాచారం. చివరిసారిగా విద్యా కా వో వాలా వీడియోలో కనిపించారు. ఈ సినిమా సైతం అంతగా విజయం సాధించలేకపోయింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!