- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Grand Father was A Prime Minister and She is Tollywood Star Hero Wife Aditi Rao Hydari
Tollywood: మాజీ ప్రధాని మనవరాలు.. టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఈ హీరోయిన్ ఎవరంటే..
సినీరంగంలో హీరోయిన్లుగా ఎదగాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ అమ్మాయి ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొందరు హీరోయిన్స్ రాజవంశానికి చెందినవారు సైతం ఉన్నారు. అందం, అభినయంతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Updated on: Feb 03, 2025 | 12:06 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అలరిస్తూ అటు నార్త్, ఇటు సౌత్ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. అదితి రావు హైదరీ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి ఆరేళ్లకే ముగిసింది. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు ప్రస్తుతం తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

అదితి రావు హైదరీ రాజుల వంశానికి చెందిన అమ్మాయి. ఆమె తాత (తండ్రి తండ్రి )అక్బర్ హైదరీ. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే మరో తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశులు.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అదితికి దగ్గరి బంధువు. అదితీ రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు. దీంతో తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది. 2006లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో నటించింది. అదితి ఎక్కువగా మణిరత్నం సినిమాల్లో కనిపించింది. సిద్ధార్థ్, అదితి కలిసి మహా సముద్రం మూవీలో నటించారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.





























