సైఫ్ కు జరిగిన ఆపరేషన్ పై అనుమానాలు? డాక్టర్లు ఏమన్నారంటే! వీడియో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్స జరిగాక ఆరు రోజులకు డిశ్చార్జి అయి ఇంటికి చేరుకోవడం జరిగాయి. ఆసుపత్రి నుంచి సైఫ్ నడుచుకుంటూ వెలుపలికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సైఫ్ ఫిట్ గా కనిపించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఆరు గంటల పాటు ఆపరేషన్ చేసిన మాట నిజమే అయితే సైఫ్ అంత ఆరోగ్యంగా, అసలేం జరగనట్టు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత అంత వేగంగా కోలుకోవడం ఎలా సాధ్యమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి తాజాగా స్పందించారు.సైఫ్ వేగంగా కోలుకోవడంపై కొంతమంది వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇలా అనుమానించే వారికి అసలు వెన్నెముకకు జరిపే శస్త్రచికిత్స గురించి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తన తల్లి 78 ఏళ్ల వయసులో వెన్నెముక ఆపరేషన్ జరిగిన రోజే నడిచిందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ పోస్టు చేశారు. ఆ వయసులోనూ తన తల్లి నడవగలిగినపుడు 54 ఏళ్లు ఉన్న సైఫ్ వారం రోజుల్లో నడుచుకుంటూ వెళ్లడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు వెన్నెముకకు జరిపే ఆపరేషన్ గురించిన మెడికల్ బుక్స్ రిఫర్ చేయాలని సూచించారు.

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
