OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టన్మెంట్.. ఆస్కార్ మూవీతో పాటు స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలివే

సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాలన్నీ భారీ కలెక్షన్లు రాబట్టడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ కళకళలాడింది. ఇక ఫిబ్రవరిలోనూ పెద్ద సినిమాల సందడి షురూ కానుంది. నాగ చైతన్య, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఈ వారం థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టన్మెంట్.. ఆస్కార్ మూవీతో పాటు స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలివే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2025 | 12:32 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా ఈ వారం నాగ చైతన్య, సాయి పల్లవిల సినిమా తండేల్ పైనే అందరి దృష్టి ఉంది. అలాగే అజిత్, త్రిషల పట్టుదల మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నథ్ సోదరడు సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఒక పథకం ప్రకారం’ కూడా ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీలోనూ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా నిర్మించిన అనూజా. బాలకార్మికుల బతుకు పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ షార్ట్ ఫిల్మ్ 97వ ఆస్కార్‌ నామినేషన్లలో ‘లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌’ చోటు దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. దీంతో పాటు కోబలి తెలుగు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు రానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తిని రేపాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్ తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి ఫిబ్రవరి మొదటివారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

అనూజా ( హిందీ సినిమా)- ఫిబ్రవరి 05 సెలబ్రిటీ బేర్‌ హంట్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5 ప్రిజన్‌ సెల్‌ 211 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5 ది ఆర్‌ మర్డర్స్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 6

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది మెహతా బాయ్స్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 7

ఇవి కూడా చదవండి

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

కోబలి (తెలుగు వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 4

సోనీలివ్‌

బడా నామ్‌ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 7

జీ 5

మిసెస్‌ (హిందీ సినిమా)- ఫిబ్రవరి 7

ఈటీవీ విన్.

కాగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ సంస్థ.. ఈ నెలలో పలు తెలుగు సినిమాలను రిలీజ్ చేయనుంది. అలా ఈ మొదటి వారంలో అలా మొదలైంది, అతడు, బేవార్స్, బిచ్చగాడు, బ్లఫ్ మాస్టర్, బాడీ గార్డ్, క్రేజీ ఫెలో, ఫిదా, మోసగాళ్లకు మోసగాడు, పాండురంగడు, సింహా, తర్వాత ఎవరు, సింహ, వాన వంటి ఎవర్ గ్రీన్ మూవీస్ ను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకు రానుంది.

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.