Pushpa 2 OTT: ఓటీటీలోనూ రప్పా రప్పా.. గ్లోబల్ రేంజ్‌లో పుష్ప2 ట్రెండింగ్‌.. ఏకంగా 21 దేశాల్లో..

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డులు బద్దలు కొట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో అలరించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది.

Pushpa 2 OTT: ఓటీటీలోనూ రప్పా రప్పా.. గ్లోబల్ రేంజ్‌లో పుష్ప2 ట్రెండింగ్‌.. ఏకంగా 21 దేశాల్లో..
Pushpa 2 The Rule Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2025 | 5:26 PM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై రెండు నెలలైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి 2’ కలెక్షన్లను సైతం అధిగమించింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న పుష్ఫ 2 సినిమాకు ప్రత్యేక గౌరవం దక్కింది. అదేంటంటే.. ఇక నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ బయో చేంజ్ చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అంటే మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ను కూడా పుష్ప రాజ్ నే రూల్ చేస్తున్నాడన్నమాట. ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 05న విడుదలైనప్పుడు లేని 25 నిమిషాల అదనపు సన్నివేశాలను ‘పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ లో చేర్చారు. ఇప్పుడు దీనినే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ‘పుష్ప 2’ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో హిందీ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

‘పుష్ప 2’ సినిమా ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. డిసెంబర్ 05న విడుదలైనప్పుడు లేని 25 నిమిషాల అదనపు సన్నివేశాలను ‘పుష్ప 2’ సినిమాలో కూడా చేర్చి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ‘పుష్ప 2’ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. త్వరలో హిందీ భాష కూడా జోడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్-10లో కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. ఇక ఇండియా ట్రెండింగ్‍లో టాప్-1లో పుష్ప 2 సత్తాచాటుతోంది. ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‍ల్లో ప్రస్తుతం పుష్ప2 టాప్‍లో ఉంది. మొత్తంగా 21 దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ చిత్రం లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్, తారక్ పొన్నన్న,జగపతి బాబు తదితరులు నటించారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.