Cricket: ఇండియన్‌ క్రికెట్ జెర్సీపై ఈ స్టార్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా.?

భారత క్రికెటర్లు ధరించే జెర్సీపై ఉండే బీసీసీఐ లోగోపై స్టార్లను గమనించే ఉంటారు. ఇంతకీ ఈ

Cricket: ఇండియన్‌ క్రికెట్ జెర్సీపై ఈ స్టార్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా.?
Cricket
Follow us

|

Updated on: Oct 30, 2024 | 4:59 PM

భారతీయులను, క్రికెట్‌ను విడదీసి చూడలేం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌ను ఒక వేడుకగా భావించే ఇండియన్స్‌ ఎంతో మంది ఉంటారు. అందుకే భారత క్రికెట్‌ బోర్డ్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైందిగా నిలిచింది. జనరేషన్స్‌తో సంబంధం లేకుండా క్రికెట్‌ను అభిమానిస్తుంటారు. క్రికెటల్ రికార్డులకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక క్రికెట్‌ లవర్స్‌కి ఇండియన్‌ క్రికెట్‌ జెర్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జెర్సీపై బీసీసీఐ లోగోను గమనించే ఉంటాం. అయితే ఈ లోగోపై నక్షత్రాలు ఉంటాయి వాటిని ఎప్పుడైనా చూశారా.? ప్రస్తుతం క్రికెటర్లు ధరిస్తున్న జెర్సీపై మొత్తం మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇంతకీ ఈ నక్షత్రాలు దేనికి సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.?

జెర్సీపై ఉండే ఈ మూడు నక్షత్రాలు భారత్‌ ఇప్పటి వరకు సాధించిన మూడు ప్రపంచకప్‌ల విజయాలకు ప్రతీక. 1983లో భారత్‌ గెలిచిన మొదటి ప్రపంచకప్‌కు సింబల్‌గా మొదటి నక్షత్రాన్ని ప్రింట్ చేశారు. కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక 2011లో గెలిచిన రెండో ప్రపంచ కప్‌కు చిహ్నంగా రెండో స్టార్ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో పాటు భారత్‌ గెలిచిన టీ20 వరల్డ్‌ కప్‌కు చిహ్నంగా మూడో స్టార్‌ని ప్రింట్ చేశారు.

ఇలా జెర్సీపై స్టార్లను ఉంచే సంప్రదాయం ఇతర క్రీడా జట్లలో కూడా కనిపిస్తుంది. ఇది జట్టు సాధించిన విజయాలను ప్రతిబింబిస్తుంది. క్రికెటర్లలో స్ఫూర్తిని నింపేందుకు. వచ్చే ప్రపంచ కప్స్‌లో విజయాన్ని సాధించాలనే ప్రేరణను పెంచడానికి ఇది ఉపయోపగుడుతుందనే ఉద్దేశంతో వీటిని ప్రింట్ చేశారు. అలాగే ఈ స్టార్స్‌ భారత క్రికెట్ జట్టు అద్భుతమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

మరిన్ని క్రెకెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..