Deepika Padukone: ముద్దుల కూతురికి నామకరణం చేసిన దీపిక.. ఏం పేరు పెట్టారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె - రణ్‌వీర్‌ సింగ్‌ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో దీపిక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ ముద్దుల తనయకు నామకరణం చేశారు దీపిక దంపతులు. దీంతో పాటు తమ గారాల పట్టి మొదటి ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు.

Deepika Padukone: ముద్దుల కూతురికి నామకరణం చేసిన దీపిక.. ఏం పేరు పెట్టారో తెలుసా?
Deepika Padukone,
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 6:26 AM

దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ 2018లో పెళ్లిపీటలెక్కారు. తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి మహాలక్ష్మిని తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. ఇక దీపావళి పండగను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టి ఫొటోతో పాటు పేరును ప్రకటించారు దీపిక-రణ్ వీర్. తమ కూతురికి దువా పదుకొణె సింగ్‌ అని నామకరణం చేసినట్టు వెల్లడించారు. ‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’’ అని చెబుతూ తమ చిన్నారి కాళ్లను ఫొటో తీసి అందులో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్లు దీపిక-రణ్ వీర్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. అలాగే దువా పదుకొణెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. అలియా భట్‌, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు దీపిక పోస్టకు స్పందించిన వారిలో ఉన్నారు. అందరూ ‘క్యూట్‌’ అంటూ లవ్‌ ఎమోజీలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లది ప్రేమ వివాహం. 2018 సంవత్సరం నవంబర్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దాంపత్య బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డ ఇప్పుడు వీరి జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దీపికా పదుకొణె. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1100 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

దీపిక, రణ్ వీర్ సింగ్ షేర్ చేసిన పోస్ట్ ఇదిగో..

ఇక దీపావళి సందర్భంగా సింగమ్ అగైన్ సినిమాతో మన ముందుకు వచ్చిందీ అందాల తార. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 01)న గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కూడా అతిథి పాత్రలో మెరిశాడు.

సింగం అగైన్ సినిమాలో దీపిక పదుకొణె..

డెలివరీకి ముందు దీపిక మెటర్నీటీ షూట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.