Tollywood: అరెరే.! సన్ ఆఫ్ సత్యమూర్తి పాప ఇంతలా మారిపోయిందేంటీ.. ఇప్పుడు చూస్తే

టాలీవుడ్‌లోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు.. అప్పట్లో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారిపోయారు. ఈ లిస్టు కొంచెం పెద్దదే. ఇక అందులో నుంచి ఒకరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా..

Tollywood: అరెరే.! సన్ ఆఫ్ సత్యమూర్తి పాప ఇంతలా మారిపోయిందేంటీ.. ఇప్పుడు చూస్తే
Son Of Satyamurthy Child Ar
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2024 | 6:23 PM

అప్పటి సినిమాల్లోని చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు హీరోయిన్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆర్య సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు శ్రావ్య.. ‘లవ్ యూ బంగారం’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. అలాగే అల్లు అర్జున్‌ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్.. ‘బలగం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఐకాన్ స్టార్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా గుర్తుందా.? అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్టు తన నటన, క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇక చిన్నారి పేరు వర్ణిక.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

ఇవి కూడా చదవండి

సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్‌కు అన్న కూతురుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది. పుష్ప 2 సినిమా పాటకు ఆమె చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు వామ్మో.! ఈమె ఆమేనా.. అప్పుడు బొద్దుగా, క్యూట్‌గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడేంటి హీరోయిన్ లెవల్‌లో మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by vernika (@baby_vernika)

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి