AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie: తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సాయి పల్లవి, చైతన్య కొత్త పోస్టర్ అదిరిపోయింది..

లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగచైతన్య, సాయి పల్లవి జంట.. ఇప్పుడు మరోసారి తండేల్ చిత్రంతో అడియన్స్ ముందుకు రాబోతుంది. కార్తీకేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

Thandel Movie: తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సాయి పల్లవి, చైతన్య కొత్త పోస్టర్ అదిరిపోయింది..
Thandel Movie
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2024 | 6:31 PM

Share

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ తండేల్. కార్తీకేయ 2 వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ చందూ మొండేటి ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చైతూ సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చైతూ, సాయి పల్లవి.. ఇప్పుడు మరోసారి జంటగా తండేల్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడూ విడుదలవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా చైతూ, సాయి పల్లవి అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండేల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటీలతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు హాజరయ్యారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ఈ ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. వాలెంటైన్స్ వీక్ ప్రారంభానికి ముందు ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే సాయి పల్లవి తనకు కూతురితో సమానమని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అలాగే ఇటీవల విడుదలైన అమరన్ సినిమా చూసి ఎమోషనల్ అయినట్లు చెప్పారు. అమరన్ సినిమా చూసిన వెంటనే సాయి పల్లవికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘నా ఫిల్మ్ కెరీర్ లో ఇప్పటివరకు రిలీజ్ డేట్ ముందుగా అనుకొని.. దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. అలా చేయడం వల్ల చాలా తప్పులు జరిగేవి. మూవీ మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేది అనుకునేవాడిని. ఈ సినిమాతో అది నెరవేరింది. అల్లు అరవింద్ కూడా ఇలాగే ఆలోచించారు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితమే ఈ మూవీ. ఈ సినిమాను ఎప్పుడూ రిలీజ్ చేసినా అది పండగే. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. సాయి పల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆమె క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ అని అన్నారు.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..