Vizag: ఇలా తయారయ్యారేంట్రా.. ఓర్నీ.! ఈ దొంగలు చేసిన పని చూస్తే మైండ్ బ్లాంక్
దొంగలు కూడా తెలివి మీరిపోయారు. టెక్నాలజీని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు.. ట్రెండ్‌కి తగ్గట్టుగా దొంగతనాలు చేస్తున్నారు. ఈ ఘటన వైజాగ్‌లో జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటంటే..
పది రూపాయల కాయిన్స్ చెల్లుతాయని ఎంత చెప్పినా ఎవ్వరూ వినట్లేదు. కిరాణా షాపుకి వెళ్లినా.. కూరగాయల షాపుకి వెళ్లినా..! ఏందమ్మా.! పది కాయిన్ ఇస్తున్నావ్.. అవి చెల్లవని మాకు తెలుసంటూ గోల చేస్తున్నారు వ్యాపారులు. పది కాయిన్ తీసుకోకపోతే కేసు పెడతామని కొందరు బెదిరిస్తున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోకుండా.. పెడితే పెట్టుకోండంటూ విసురుగా సమాధానమిస్తున్నారు. సరే.! ఇంతకీ ఇప్పుడెందుకా పదిరూపాయల కాయిన్‌ల ప్రస్తావన గురించి అంటే.!
శనివారం విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న రెండు గుళ్లు, ఒక ఇంట్లో దొంగలు పడి.. 8 తులాల బంగారం.. ఆరేడు తులాల వెండి, 15 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం చుట్టుప్రక్కల వారిని ఎంక్వయిరీ చేశారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన విజువల్స్ పరిశీలించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అందులో ఓ సీన్ మాత్రం వారికి షాక్ గురి చేసింది. హుండీలను కొల్లగొట్టి.. ఉన్నదంతా ఊడుచుకెళ్లిన దొంగలు పది రూపాయల కాయిన్స్‌ను పనికిరాని పైసలు అనుకుని.. వాటిని మాత్రం వదిలేసి.. మిగిలిన చిల్లరిని మూటగట్టుకుని వెళ్లిపోయారు. ఒకవైపు ఆర్బీఐ సిబ్బంది పది రూపాయల కాయిన్స్‌పై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నా.. ఎవ్వరూ కూడా పది కాయిన్స్ ఇవ్వట్లేదు.. తీసుకోవట్లేదు. ఈ దొంగలు కూడా అదే తంతును ఫాలో అయ్యారని చెప్పొచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..