AP News: ఏపీ మహిళలకు మరిన్ని గుడ్‌న్యూస్‌లు.. ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్
ఏపీ మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రి ఈ పధకం అమలుపై కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.
ఏపీ మహిళలకు మరిన్ని గుడ్‌న్యూస్‌లు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పధకాన్ని ప్రారంభించిన కూటమి సర్కార్.. మిగిలిన పథకాల అమలుపైనా కసరత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర మహిళలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై తాజాగా ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.
సూపర్ సిక్స్‌లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామన్నారు. సంక్రాంతి పండుగలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని సైతం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తున్నారని మంత్రి అన్నారు. కాగా, ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. మొదటిగా ఈ పధకం ఆగష్టు 15న అమలు చేస్తారని ప్రచారం జరిగినా.. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఉచిత బస్సు పధకంపై ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు చేసింది. తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం అమలవుతున్న తీరును ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. దానికి సంబంధించిన నివేదికను సైతం సీఎం చంద్రబాబుకు అందించినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..