AP TET 2024 Results Out: ఏపీ టెట్ రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి లోకేష్.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారంమంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..
అమరావతి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్ 4) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ చేతుల మీదగా విడుదల చేశారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు మొత్తం 17 రోజుల పాటు టెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసిన విద్యాశాఖ.. అన్ని సబ్జెక్టులకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫైనల్ ఆన్సర్ కీన రూపొందించి.. దానిని అక్టోబర్ 29న విడుదల చేశారు. ఈ రోజు ఉదయం టెట్ పరీక్ష ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు దాదాపు 4,27,300 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది హాజరయ్యారు.
ఏపీ టెట్ జులై-2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు ఈ నెల 2న టెట్ చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ ఆలస్యంగా వెల్లడించడంతో జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఫలితాల ప్రకటన వాయిదా పడింది. డీఎస్సీలో టెట్కు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. పైగా టెట్ స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఈ సారి పరీక్ష రాసిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగింది. టెట్ ఉత్తీర్ణత శాతం కమ్యూనిటీ వారీగా వేరువేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఓసీ(జనరల్) కేటగిరీలో 60 శాతం మార్కులు ఆపైన వస్తే ఉత్తీర్ణత పొందినట్లు అవుతుంది. ఇక బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో 40 శాతం మార్కులు ఆపైన మార్కులు పొందిన వారు మాత్రమే టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తారు.
మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో నవంబర్ 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.