AP TET 2024 Results: టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత బేజారు.. అన్ని పేపర్లలో భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్! కారణం అదేనా..?

ఏపీ టెట్ జులై-2024 ఫలితాల్లో పాస్‌ పర్సెంటైల్ భారీగా తగ్గింది. గత టెట్ పరీక్షతో పోలిస్తే ఈసారి అన్ని పేపర్లలో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ నమోదైంది. ఈసారి టెట్ ప్రశ్నాపత్రాలు అత్యంత కఠినంగా ఉండటమే అందుకు కారణం అంటున్నారు నిపుణులు..

AP TET 2024 Results: టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత బేజారు.. అన్ని పేపర్లలో భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్! కారణం అదేనా..?
AP TET 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 8:19 AM

అమరావతి, నవంబర్‌ 5: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్‌ 4) విడుదలైన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈసారి టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. అందుకు కారణం ప్రతి సబ్జెక్ట్‌ పేపర్‌ కఠినంగా ఉండటమేనని తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టెట్ పరీక్షతో పోల్చితే తాజా టెట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలు మరింత కఠినంగా వచ్చాయి. దీంతో పాస్‌ పర్సెంటైల్‌ గణనీయంగా తగ్గింది. మొత్తం 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది టెట్‌ పరీక్షలు రాస్తే.. వారిలో కేవలం 1,87,256 మంది మాత్రమే అర్హత సాధించారు. అదీ అత్తెసురు మార్కులతో మాత్రమే ఉత్తీర్ణత పొందారు. దీంతో పాస్‌ పర్సెంటైల్‌ 50.79 శాతంగా నమోదైంది.

పేపర్‌ వారీగా టెట్‌ ఉత్తీర్ణత వివరాలు ఇవే

  • పేపర్ 1 (A) ఎస్జీటీ తెలుగు అండ్‌ మైనర్ మీడియా పేపర్‌కు 1,60,017 మంది పరీక్ష రాస్తే వారిలో 1,04,785 మంది అంటే 65.48 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
  • పేపర్‌ 1 (B) ఎస్జీటీ స్పెషల్‌ స్కూల్స్ పేపర్‌కు 2173 మంది హాజరైతే వారిలో 767 (35.3) మంది ఉత్తీర్ణత పొందారు.
  • పేపర్ 2 (A) స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజెస్‌ పేపర్‌కు 55,781 మంది పరీక్ష రాస్తే వారిలో 22,080 మంది అంటే 39.58 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
  • పేపర్ 2 (A) స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ పేపర్‌కు 88,290 మంది పరీక్ష రాస్తే వారిలో 33,525 మంది అంటే 37.97 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
  • పేపర్ 2 (A) స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్ స్టడీస్‌ పేపర్‌కు 60,442 మంది పరీక్ష రాస్తే వారిలో 24,472 మంది అంటే 40.49 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
  • పేపర్ 2 (A) స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ స్కూల్స్ పేపర్‌కు 1958 మంది పరీక్ష రాస్తే వారిలో 1627 మంది అంటే 87.09 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.

మొత్తంగా అన్ని పేపర్లలో చూస్తే పేపర్ 2 (A) స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ స్కూల్స్ పేపర్‌లో అధికంగా 87.09 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఆ తర్వాత పేపర్ 1 (A) ఎస్జీటీ తెలుగు అండ్‌ మైనర్ మీడియా పేపర్‌లో అధికంగా 65.48 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. మిగిలిన అన్ని పేపర్లలో పాస్‌ సర్సెంటైల్‌ 40 శాతానికి మించకపోవడం గమనార్హం. టెట్ పరీక్ష ఇంత కఠినంగా ఉంటే రాబోయే డీఎస్సీ పరీక్ష ఇంకెంత కఠినంగా ఉంటుందోనని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఏపీ టెట్‌ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు మొత్తం 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షకు దాదాపు 4,27,300 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇక మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో నవంబర్‌ 6న అంటే బుధవారం ప్రకటన విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.