Viral Video: ఐఐటీ విద్యార్ధుల దీపావళి రాకెట్‌ స్టంట్‌ వీడియో చూశారా..? 112 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట రచ్చ

దీపావళి టపాకాయలు పేల్చడంలో ఐఐటీ దన్‌బాద్‌ విద్యార్ధుల స్టేలే వేరబ్బ.. ఏకంగా రాకెట్ లాంచ్ చేసేశారు. ఈ వీడియో చూస్తే ఎలన్ మస్క్ వీరి కోసం స్పెషల్ విమానం పంపించి తన కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీడియో చూస్తే మీ రియాక్షన్ కూడా ఇదే రేంజ్ లో ఉంటుంది..

Viral Video: ఐఐటీ విద్యార్ధుల దీపావళి రాకెట్‌ స్టంట్‌ వీడియో చూశారా..? 112 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట రచ్చ
IIT Dhanbad Students' Firecracker Stunt
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2024 | 11:52 AM

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు మిన్నంటాయి. రంగురంగుల టపాసులను కాల్చి ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. అయితే దీపావళి సంబరాలు జరుపుకోవడంలో ఐఐటీ దన్‌బాద్‌ విద్యార్ధుల ప్రత్యేకతే వేరు. అదేంటీ..? అని అనుకుంటున్నారా.. ? అవును.. IIT ధన్‌బాద్‌ విద్యార్ధులు దీపావళికి కాల్చిన టపాసుల గురించి ఇప్పుడు యావత్‌ దేశమంతా చర్చిస్తుంది. అంత స్పెషల్‌గా ఏం చేశారని బుర్రలు బద్దలు కొట్టుకోకండి. వీరు టపాలులు కాల్చిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. కేవలం 3 రోజుల వ్యవధిలో ఏకంగా 112 మిలియన్ల వ్యూస్ వచ్చాయి మరి. ఇంకేం మీరూ ఈ వీడియో వైపు ఓ లుక్కేసుకోండి..

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. IIT ధన్‌బాద్‌ క్యాంపస్‌లోని విద్యార్ధులు కొందరు టెన్నిస్‌ కోర్టులో నిలబడి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. వారిలో ఇద్దరు విద్యార్ధులు కోర్టులోపల నిలబడి ఉంటే.. మరో ఇద్దరు కొర్టు బయట ఉంటారు. కోర్టు లోపల నిలబడి ఉన్న ఇద్దరు విద్యార్ధుల్లో ఒకరు నేలపై ఓ టపాకాయి వెలిగించడం వీడియలో చూడొచ్చు. దానిని వెలిగించగానే అతగాడు దూరంగా పరుగులు తీస్తాడు. అనంతరం పక్కనే ఉన్న మరో విద్యార్ధి వెలిగించిన టపాకాయి మీద ప్లాస్టిక్‌ డ్రమ్‌ బోర్లించి దూరంగా పరుగు లంకించుకోవడం వీడియో కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సెకన్ల పాటు నిశ్శబ్ధం. అంతలోనే పెద్ద శబ్ధంలో టపాకాయి పేలడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by cistales (@cis_tales)

ఇక్కడే ఉంది అసలు విచిత్రం. అలా టపాకాయి పేలిందో.. లేదో.. దానిపై బోర్లించిన ప్లాస్టిక్‌ డ్రమ్‌ ఒక్కసారిగా రాకిట్ మాదిరి ఆకాశంలోకి దూసుకుపోవడం వీడియోలో చూడొచ్చు. ఏకంగా నాలుగు ఫ్లోర్లు ఉన్న బిల్లింగ్‌ ఎత్తును దాటి ఆ డ్రమ్‌ పేకి వెళ్లి, మళ్లీ అమాంతం నేలపై పడిపోయింది. IIT ధన్‌బాద్‌ విద్యార్థుల దీపావళిని పటాకుల స్టంట్‌ నెట్టింట రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ‘రాకెట్ బాయ్స్ ఫ్రమ్ ఆయ్ ఆయ్‌ టీ ధన్‌బాద్’ అనే క్యాప్షన్ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దీనికి 3 రోజుల వ్యవధిలోనే 6 మిలియన్లకు పైగా లైక్‌, 112 మిలియన్లకు పైగా వీక్షణలను రావడంతో తెగ వైరల్‌ అవుతుంది. ఇక నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. ‘వీళ్లు దీనిని NASAకి తీసుకెళ్లరని నేను ఆశిస్తున్నాను!’, ‘ఐఐటియన్లు మాత్రమే దీపావళిని సైన్స్ ప్రయోగాలకు వినియోగిస్తారు’, ఈ వీడియో చూస్తే ఎలోన్ మస్క్ ఈ నలుగురు అబ్బాయిలను SpaceX కోసం రిక్రూట్ చేసుకోవడానికి ఒక ఫ్లైట్ బుక్ చేసే ఛాన్స్‌ ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదీఏమైనా ఐఐటీ బుర్రలే వేరబ్బ.. మీరేమంటారు?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.