Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pure Camphor: మీరు వాడే కర్పూరం అసలైనదేనా? ఇలా తెలుసుకోండి

మార్కెట్లో అన్నీ వస్తువులకు కల్తీలు వచ్చేస్తున్నాయ్.. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో అనేకమంది కర్పూరంతో పూజలు చేస్తుంటారు. అయితే తెల్లగా ఉన్నంత మాత్రన ప్రతిదీ కర్పూరం కాదు. కల్తీ కూడా జరగొచ్చు. మీరు వాడే కర్పూరం అసలైందో.. కాదో.. ఇలా తెలుసుకోండి..

Srilakshmi C

|

Updated on: Nov 03, 2024 | 12:45 PM

చాలా మంది రోజూ పూజ చేసే సమయంలో కర్పూరాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా తొలగిపోయి, స్వచ్ఛంగా మారుతుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్‌టివిటీని తీసుకువస్తుందని కూడా చాలా మంది నమ్ముతారు.

1 / 5
అంతేకాకుండా కర్పూరంలోని ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ, జుట్టు సంరక్షణలో కూడా కర్పూరం పాత్ర మర్చిపోలేనిది. అయితే మీరు పూజకు ఉపయోగించే కర్పూరం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఈ కింది చిట్కాలను ట్రై చేయండి.

2 / 5
కల్తీ కర్పూరాన్ని కాల్చినప్పుడు మంట కొద్దిగా నారింజ రంగులో ఉంటుంది. అదే స్వచ్ఛమైన కర్పూరాన్ని కాల్చితే మంచి సువాసనతో నల్లని పొగ వెదజల్లుతుంది. అలాగు స్వచ్ఛమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే అది దిగువకు చేరుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన కర్పూరం బరువుగా ఉంటుంది. కానీ నకిలీ కర్పూరం నీటిపై తేలుతుంది.

3 / 5
స్వచ్ఛమైన కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలదు. కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలి ఉంటే, అది పూర్తిగా నకిలీ అని అర్థం చేసుకోవాలి. అలాగే స్వచ్ఛమైన కర్పూరం త్వరగా కరగదు. కాలిపోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు వెలిగించిన కర్పూరం త్వరగా కాలిపోయి కరిగిపోతే, దానిని నకిలీగా అర్థం చేసుకోవచ్చు.

4 / 5
చాలా మంది రోజూ పూజకి కర్పూరాన్ని ఉపయోగిస్తంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్‌టివిటీని తీసుకువస్తుందని చెబుతారు. కర్పూరంలోని ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను నివారించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, చర్మం, జుట్టు సంరక్షణలో కర్పూరం పాత్ర అపారమైనది.

5 / 5
Follow us