- Telugu News Photo Gallery Health Tips: Know the health benefits of consuming SOYA CHUNKS or MEAL MAKER thrice a week
Health Tips: మైనోపాజ్ మహిళలకు ఓ వరం మీల్ మేకర్స్.. వారానికి ఎన్ని సార్లు వీటిని తినాలో తెలుసా..
శీతాకాలం వస్తే చాలు కీళ్లనొప్పులు రోజురోజుకు పెరిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి నొప్పులను అధిగమించడంలో మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రోజు మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Nov 03, 2024 | 11:59 AM

సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్ గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. మాంసాహారానికి సరిసాటి మీల్ మేకర్. సోయా పిండిని మీల్ మేకర్ గా తయారు చేస్తారు. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ మీల్ మేకర్స్‌ను వెజిటేరియన్ మీట్ అని కూడా అంటారు. వీటితో తయారు చేసిన ఆహారం చాలా రుచికరమైనది.

ధర తక్కువ, తినడానికి రుచికరమైన ఆహారం మీల్ మేకర్స్. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మోకాలు, నడుము, చేయి లేదా మెడ నొప్పి ఉన్న రోగులకు మంచి ఫుడ్. ముఖ్యంగా రోజురోజుకూ ఆర్థరైటిస్ రోగులు ఆ నొప్పిని అధిగమించడంలో ఈ స్వాబ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వారానికి కనీసం మూడు రోజుల పాటు 30 నుంచి 50 గ్రాముల మీల్ మేకర్స్‌ను లేదా సాధారణ సోయామిల్క్ తీసుకోవడం వలన ఎముకల క్షీణతను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకల్లో క్యాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎముకలు పెళుసుగా మారుతాయి. ఫైటోఈస్ట్రోజెన్‌లు అధికంగా ఉండే మీల్ మేకర్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం లోపం తగ్గుతుంది.

రుతుక్రమం ఆగిపోయిన మహిళలు కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా 30 గ్రాముల మీల్ మేకర్స్‌ను తీసుకోవాలి. మీల్ మేకర్స్‌లోని ప్రోటీన్ బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకల నష్టం సమస్యలను కూడా నివారిస్తుంది. అటువంటి వ్యాధులను నివారించడంలో మీల్ మేకర్స్‌లోని ప్రోటీన్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

మీల్ మేకర్స్‌లో ఐసోఫ్లేవిన్, లెసిథిన్ ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు బలమైన యాంటీ ఆక్సిడెంట్లు. తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ధమనులలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను కలిగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మీల్ మేకర్స్ యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడతాయి.

మీల్ మేకర్స్‌లో ఐసోఫ్లేవిన్ చాలా బలమైన ఫైటోఈస్ట్రోజెన్. ఈ పదార్ధం చర్మం , జుట్టును ప్రకాశవంతంగా.. మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది. మీల్ మేకర్స్‌లోని లెసిథిన్ రక్తపోటును సాధారణంగా ఉంచడం ద్వారా గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా అకాల వృద్ధాప్యం నుంచి బయటపడతారు. మీల్ మేకర్స్‌లోని లెథిసిన్ కొవ్వు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.

మీల్ మేకర్స్ ను రోజూ రెగ్యులర్ గా ఆహారంగా తీసుకోవడం వలన అధిక-సాంద్రత కొలెస్ట్రాల్, తక్కువ-సాంద్రత కొలెస్ట్రాల్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీల్ మేకర్స్‌లో ఉండే ప్రొటీన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణంగా ఉంచడంలో దీనిలోని ఫైబర్ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.

మీల్ మేకర్స్ ను తినే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మీల్ మేకర్స్‌ను తినడం సరైనది కాదు. చాలా మంది మీల్ మేకర్స్ ను తింటే జీర్ణం అయ్యే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే సోయా మిల్క్‌ని ప్రతిరోజూ తీసుకోవచ్చు. లాక్టోస్ అసహనం , పాలు జీర్ణం అవ్వని వారు ప్రతిరోజూ సోయా పాలను తీసుకోవచ్చు. సోయా పాలు పిల్లలకు కూడా చాలా మేలు చేస్తాయి.





























