Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ప్రభుత్వ దవాఖానలో అమానుషం..! భర్త మృతి చెందిన బెడ్‌ను గర్భిణీతో కడిగించారు.. వీడియో

ప్రభుత్వాసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతూ భర్త మృతి చెందితే.. ఆస్పత్రి సిబ్బంది గర్భిణీతో ఆ బెడ్ ను శుభ్రం చేయించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..

Watch Video: ప్రభుత్వ దవాఖానలో అమానుషం..! భర్త మృతి చెందిన బెడ్‌ను గర్భిణీతో కడిగించారు.. వీడియో
Pregnant Woman Forced To Clean Hospital Bed
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 03, 2024 | 9:47 AM

భోపాల్‌, నవంబర్‌ 3: ఓ ప్రభుత్వ దవాఖాన సిబ్బంది గర్భిణీ పట్ల అమానుషంగా వ్యవహరించారు. ప్రాణాలతో పోరాడుతున్న భర్తను కాపాడండంటూ భార్య ఆసుపత్రికి తీసుకువచ్చింది. అయితే తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న భర్త కాసేపటికే మరణించాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న ఆమె పట్ల ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరించింది. ఆసుపత్రి బెడ్‌పై పడిన భర్త రక్తాన్ని శుభ్రం చేసి, మృతదేహాన్ని తీసుకుపోవాలని హుకూం జారీ చేశారు. దీంతో పుట్టెడు దుఃఖాన్ని గొంతులోనే అణచిపెట్టి, బెడ్‌ శుభ్రం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని డిండోరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రామ్‌రాజ్‌ మరవి (28) కుటుంబ సభ్యులకు తమ సమీప బంధువులతో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో లాల్‌పూర్ సాని గ్రామంలో గురువారం సాయంత్రం శివరాజ్, అతని తండ్రి ధరమ్ సింగ్ (65), సోదరుడు రఘురాజ్ (42)పై దాదాపు 25 మంది వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో రామ్‌రాజ్‌ ఇద్దరు అన్నయ్యలు, తండ్రి మరణించారు. రామ్‌రాజ్‌ తీవ్ర గాయాలతో జిల్లా దవాఖానలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే అతడు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఆయనకు చికిత్స చేసిన బెడ్‌పై రక్తాన్ని 5 నెలల గర్భిణీ అయిన ఆయన భార్య రోష్ని మరావితో దవాఖాన సిబ్బంది కడిగించారు. వీడియోలో ఆమె రక్తంతో తడిసిన బెడ్‌ను శుభ్రం చేయడం వీడియోలో కనిపించింది. అదే సమయంలో దవాఖాన సిబ్బంది నీళ్లు ఇస్తూ, ఆదేశాలు ఇవ్వడం కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్లిప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ప్రధాన వైద్య ఆరోగ్య అధికారి (CMHO) CHC సిబ్బందికి షో-కాజ్ నోటీసు జారీ చేశారు. అటెండర్ డాక్టర్‌తో సహా ఇద్దరు నర్సులను సస్పెండ్ చేస్తూ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (దిండోరి) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రోషిణి తన భర్త రక్త నమూనాలను తీసుకుందని, బెడ్‌ను శుభ్రం చేయాలని ఆమెను ఎవరూ కోరలేదని ఓ వైద్యుడు వివరణ ఇచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.