AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants Death Mistery: 48 గంటల్లో 8 ఏనుగులు అనుమానాస్పద మృతి.. అసలేం జరుగుతుందక్కడ?

మధ్యప్రదేశ్ లో ఏనుగుల వరుస మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గడచిన రెండు రోజుల్లో ఏకంగా 8 ఏనుగులు మృతి చెందడం కలకలంగా మారింది. దీంతో ఫారెస్ట్ అధికారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఉద్ధేశ్య పూర్వకంగా చంపుతున్నారా? లేదంటే ఏనుగులు వాటంతట అవే మరణిస్తున్నాయా? అనే విషయంపై దర్యాప్తు సాగుతోంది..

Elephants Death Mistery: 48 గంటల్లో 8 ఏనుగులు అనుమానాస్పద మృతి.. అసలేం జరుగుతుందక్కడ?
ఏనుగు శాకాహారి. ఏనుగులు తినే ఆహారం సీజన్, వాటి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది
Srilakshmi C
|

Updated on: Nov 01, 2024 | 10:05 AM

Share

భోపాల్‌, నవంబర్‌ 1: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో గడచిన 48 గంటల్లో ఏకంగా ఎనిమిది ఏనుగులు మృత్యవాత పడ్డాయి. మంగళవారం వరకు ఏడు ఏనుగులు మృతి చెందగా, బుధవారం మరో ఏనుగు మృతదేహం లభ్యమైంది. దీంతో బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగుల మరణాలు మిస్టరీగా మారాయి. మృతిచెందిన ఏనుగుల్లో మూడు ఏళ్ల వయస్సు ఏడు ఆడ ఏనుగులు.. మరొక నాలుగేదేళ్ల వయసున్న మగ ఎనుగు ఉన్నాయి.

మొత్తం 13 ఏనుగులు అశ్వస్థతకు గురికాగా వాటిల్లో వైద్యసేవలు అందించిన పది ఏనుగులు ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. మిగిలిన మూడు ఏనుగులకు చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మరో ఏనుగు పరిస్థితి విషమంగా ఉంది. ఏనుగుల వరుస మృతిపై.. NTCA (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ)కి చెందిన ముగ్గురు సభ్యుల బృందం బాంధవ్‌గఢ్‌లో పర్యటిస్తోంది. మరోవైపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణ చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం పాయిజన్‌గా అధికారులు అనుమానిస్తురు. ఏనుగు కళేబరాలు లభ్యమైన ప్రాంతాల్లోని పొలాలు, ఇళ్లలో వన్యప్రాణి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.

మృతి చెందిన ఏనుగుల మల పదార్థం, మట్టి, సమీపంలోని మొక్కల నుండి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఆ ప్రాంతంలో పులులు, ఇతర వన్య ప్రాణులు సంచరిస్తూ ఉండటంతో విచారణకు ఆటంకం కలుగుతోంది. మృతి చెందిన ఏనుగుల్లో ఎనిమిదింటిని పాతిపెట్టారు. కాగా 2021 – 2023 మధ్యకాలంలో బాంధవ్‌గర్, షాహ్‌దోల్ అటవీ ప్రాంతంలో పులులు కూడా పెద్ద సంఖ్యలో మరణించాయి. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది. దాదాపు 43 పులులు చనిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.