AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన ఈ హైవేపై ప్రమాదాలతో నిత్యం రక్తసిక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై 17బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు.

Telangana: హైదరాబాద్ - విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!
Hyderabad Vijayawada National Highway
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 01, 2024 | 9:47 AM

Share

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణకు మోక్షం కలిగింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ – విజయవాడ హైవేపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేను ఆరు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెంబర్ 65 కీలకమైనది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేను ఆరు లైన్లుగా విస్తరించేందుకు 2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.1740 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించింది. ఆ సమయంలోనే ఆరు లేన్ల రహదారి కోసం భూసేకరణ చేశారు. 2012లో జీఎమ్మార్.. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. ఇలా 2025 జూన్ వరకూ టోల్ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. నిత్యం ప్రమాదాలతో ఈ హైవే రక్తసిక్తంగా మారుతుండడంతో ఆరు లైన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ హైవేని ఎట్టకేలకు ఆరులేన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రెండేండ్లలోగా ఈ హైవే ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

17బ్లాక్‌ స్పాట్‌లలో నిత్యం ప్రమాదాలు..

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన ఈ హైవేపై ప్రమాదాలతో నిత్యం రక్తసిక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై 17బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. చౌటుప్పల్‌, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడు జంక్షన్‌, జనగాం ఎక్స్‌రోడ్డు, పిల్లలమర్రి ఎక్స్‌రోడ్డు, దురాజ్‌పల్లి, ముకుందా పురం, ఆకుపాముల, కొమరంబండ, కట్టకొమ్ముగూడెం, మేళ్ళచెర్వు ఎక్స్‌రోడ్డు, మునగాల ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఫ్లైఓవర్లు లేకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 569 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 56 మంది మృతి చెందారు. ఈ కిల్లర్ రోడ్డుపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో సగటున రోజుకు రెండు ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ..

ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదిగా వెళుతున్న NH65ను ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఒప్పించి ఆరు లైన్ల విస్తరణకు నిధులు తెప్పించారు. మరోవైపు ఈ హైవేపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిద్దుబాటు పనులకు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణం, సైన్‌ బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ స్పాట్స్ దిద్దుబాటు పనులను రామ్ కుమార్ సంస్థ చేపడుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణతోనైనా ప్రమాదాలకు చెక్ పడుతుందని జిల్లా వాసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..