Danger AQI: తెలంగాణలో గాలి చాటున దూసుకు వస్తోన్న గత్తర.. భయపెడుతున్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌..

హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు సహా వరంగల్‌, నిజామాబాద్‌లో ఎయిర్‌ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో తగ్గుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో ఏక్యూఐ 128 ఉండగా, పార్టిక్యులేట్​మ్యాటర్ స్థాయి 2.5 గ్రాములు ఉంది.

Danger AQI: తెలంగాణలో గాలి చాటున దూసుకు వస్తోన్న గత్తర.. భయపెడుతున్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌..
Telangana Air Pollution
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 01, 2024 | 9:19 AM

ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుందో లేదో కానీ గట్టిగా గాలి పీలిస్తే లైఫ్‌కు రిస్కే. వెన్నుపోటు అక్కర్లేదు. డైరెక్ట్‌గా పొగపోటే. ఢిల్లీలోనే కాదు తెలంగాణలోనూ గాలి ఓ రేంజ్‌లో గడబిడ చేస్తోంది. హైదరాబాద్‌, వరంగల్‌ సహా పది జిల్లాల్లో ఎయిర్‌ క్వాలీటీ ఇండెక్స్‌(AQI) డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.

వ్యర్థాలకు మంట.. ప్రాణాలకు పొగ. కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఆరోగ్యం మసకబారుతోంది. హర్యానా , పంజాబ్‌ సాగు వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో పొగ మేఘాలు ఢిల్లీపై పంజా విసరుతున్నాయి. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలీటీ ఇండెక్స్‌ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కట్‌ చేస్తే ఇక తెలంగాణలో సైతం అదే దుస్థితి రాబోతుందా? చాపకింద నీరులా కాదు.. గాలి చాటున గత్తర దూసుకు వస్తోందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు చూస్తే నగరం విస్తరిస్తోంది. రెండో వైపు చూడకపోతే నగరం ఖచ్చితంగా నరకంగా మారే ప్రమాదం వుంది. గాలి నాణ్యతకు సంబంధించి వివధ సంస్థల అధ్యయనంలో సంచలనాలు వెలుగుచూశాయి .

హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు సహా వరంగల్‌, నిజామాబాద్‌లో ఎయిర్‌ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో తగ్గుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో ఏక్యూఐ 128 ఉండగా, పార్టిక్యులేట్​మ్యాటర్ స్థాయి 2.5 గ్రాములు ఉంది. వరంగల్‌లో అత్యధికంగా ఏక్యూఐ 143 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర నమోదయింది.

ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే..గాలి గాడి తప్పినట్టే. తెలంగాణలో ఇప్పుడు చాలా చోట్ల 100 నుంచి 150 మార్క్‌ను టచ్‌ చేసింది. AQI స్థాయి 50 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్​క్వాలిటీ , 100 నుంచి 150 వరకుంటే ‘అన్​హెల్దీ’, 150 నుంచి 200 రికార్డయితే డేంజర్‌.. ఇక AQI మూడు వందల రేంజ్‌లోకి వెళ్లింది ఇక ప్రాణాలకు మూడినట్టే. 300 ప్లస్ రికార్డయితే పరిస్థితి యమ డేంజర్‌ . ఢిల్లీ తరహాలో కాదు కానీ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలోనూ ఎయిర్‌ పొల్యూషన్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వాహనాలు … పరిశ్రమలు ఇప్పటికే పొగ పెడుతుంటే ..దీపావళి బాణా సంచాతో గండానికి మరింత సెగ వేసినట్టయింది. గాలి కలుషితమైతే శ్వాస సంబంధ వ్యాధులు సహా హార్ట్‌ స్ట్రోక్స్‌ పెరిగే అవకాశం వుంటుంది. సైలెంట్‌ కిల్లర్‌లా దూసుకు వస్తున్న కాలుష్యానికి కళ్లెం వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. కుదిరితే కాలుష్య నియంత్రణకు సహకరించాలి. వ్యక్తిగతంగా ప్రాణాలు కాపాడుకోవాలంటే కరోనా రూల్‌ పాటించాలి. మాస్క్‌ ధరించడం మంచిదంటున్నారు నిపుణులు. గాలే కదా అని లైట్‌గా తీస్కోంటే .. లైఫ్‌ పొగచూరిపోవడం ఖాయం. జర భద్రం బికేర్‌ ఫుల్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..