Telangana: సరోజినీ దవాఖానకు క్యూ కట్టిన జనం.. దీపావళి పండుగే కారణమా?

సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కట్టారు. దీపావళి సందర్భంగా బాణసంచా పేలడంతో గాయాలతో బాధితులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 50 కేసులు నమోదనట్లు తెలుస్తుంది. 34 మందికి స్వల్ప గాయాలైనట్లు, 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.

Telangana: సరోజినీ దవాఖానకు క్యూ కట్టిన జనం.. దీపావళి పండుగే కారణమా?
Sarojini Devi Eye Hospital
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 01, 2024 | 9:06 AM

హైదరాబాద్ సరోజినీ దేవి హాస్పిటల్‌కు పేషంట్స్ క్యూ కట్టారు. నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో పలు ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది పేషెంట్లు గాయలతో సరోజినీ దేవి ఆసుపత్రికి వచ్చారు. పటాకులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోమని వైద్యులు ఎంత హెచ్చరిస్తున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది  సరోజినీ దేవి హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల వారి సంఖ్య అధికంగా ఉంటుంది. బాణాసంచా కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గాయాల పాలవుతున్నట్లు వైద్యులు తెలిపారు. 34 మందికి స్వల్ప గాయాలైనట్లు, 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి