Car Accident: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం!

దీపావళి రోజు రాత్రి నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చిన బెంజ్ కారు బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది

Car Accident: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం!
Benz Car Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 01, 2024 | 8:38 AM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, కేబీఆర్ పార్క్ ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టి, గ్రిల్స్‌ను ధ్వంసం చేసింది బెంజ్ కారు. కేబీఆర్ పార్కు లోపలకు దూసుకెళ్లిన కారు, చెట్టును ఢీకొట్టి ఆగింది. ప్రమాదస్థలి భయానక వాతావరణంగా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు అయ్యినట్లుగా సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. —

దీపావళి రోజు రాత్రి నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చిన బెంజ్ కారు బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఫుట్ పాత్ పై ఉన్న బసవ తారకం క్యాన్సర్ పేషంట్ల సహాయకులు, నిరాశ్రయులు ప్రాణ భయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుచుకున్నారు.

కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు వదిలి డ్రైవర్ పారిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి బడాబాబు పుత్రరత్నం నిర్వాకం కావొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!