Infant Sold By Father: అంగట్లో ఆడపిల్ల.. పుట్టిన 25 రోజులకే భారంగా భావించి.. రూ.30 వేలకు అమ్మేసిన తండ్రి!

ఆడపిల్లంటే అందరికీ చులకనే. పేదింట పుట్టినా.. పెద్దింట పుట్టినా.. ఆగచాట్లు తప్పవు. ఓ తండ్రి ఎందుకు అనవసరంగా పెంచాలని అనుకున్నాడేమో, పెంపకానికి డబ్బు వృద్ధా అవుతుందని భావించాడేమో.. ఓ అయ్యకు బేరం పెట్టాడు. డబ్బు కూడా ముట్టింది.. కానీ అంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది..

Infant Sold By Father: అంగట్లో ఆడపిల్ల.. పుట్టిన 25 రోజులకే భారంగా భావించి.. రూ.30 వేలకు అమ్మేసిన తండ్రి!
Infant Sold By Father
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 31, 2024 | 10:46 AM

గౌహతి, అక్టోబర్‌ 31: కాసులకు కక్కుర్తి పడిన ఓ కసాయి తండ్రి రోజుల కన్న బిడ్డను అమ్ముకున్నాడు. గడ్డు పేదరికంతో బాధపడుతున్న అతడు పొట్ట నింపుకోవడానికి కళ్లు తెరచి లోకం చూడని పొత్తిళ్లలోని పసికందును నిర్ధాక్షిణ్యంగా అమ్ముకున్నాడు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ధేమాజీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అస్సాంలోని ధేమాజీ జిల్లాలో అక్టోబర్ 4న దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులైన ధిమాన్ బోరా, సబితా బోరా పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఆడ పిల్లను భారంగా భావించారు. దీంతో చేసేదిలేక 25 రోజుల కన్న బిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించి, బిడ్డను కాపాడారు. ఓ డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షించారు.

దీనిపై చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందడంతో చైల్డ్‌ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) దీనిపై స్పందించింది. పెగు సోహోరియా, ఆమె భర్తకు ఆ పసికందును రూ.30,000కు అమ్మేశారు. దీంతో సిలాపత్తర్‌లోని డాక్టర్ చంద్రజిత్ డోలే ఇంట్లో ఉన్న ఆ శిశువును రక్షించి స్వాధీనం చేసుకున్నారు. శిశువు తల్లిదండ్రులను గుర్తించి తమ వద్దకు రావాలని ఆదేశించింది. ఇక శిశువు విక్రయంలో బుబుల్ బోరా, దిలీప్ సైకియా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!