AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోర్టులో పిచ్చకొట్టుడు కొట్టుకున్న జడ్జి, లాయర్లు.. లాఠీచార్జి చేసిన పోలీసులు! వీడియో

ఓ కేసులో నిమిత్తమై కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఈ క్రమంలో జడ్జి బెయిల్ నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన లాయర్లు ఏకంగా జడ్జిపైనే దాడి చేసేందుకు సిద్ధపడ్డారు.. జడ్జి చాంబర్ వద్దకు పరుగులు తీయడంతో ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. కోర్టులోకి ప్రవేశించిన పోలీసులు లాయర్లందరినీ లాఠీలతో కొడుతూ చెదరగొట్టారు..

Watch Video: కోర్టులో పిచ్చకొట్టుడు కొట్టుకున్న జడ్జి, లాయర్లు.. లాఠీచార్జి చేసిన పోలీసులు! వీడియో
Ghaziabad District Court Incident
Srilakshmi C
|

Updated on: Oct 30, 2024 | 11:22 AM

Share

ఘజియాబాద్‌, అక్టోబర్‌ 30: ఆ కోర్టులో వాదప్రతివాదనలు సీరియస్‌గా జరుగుతున్నాయి. జడ్జి, లాయర్లు మధ్య మటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. అంతే.. ఒక్కసారిగా కోర్టు వాతావరణం మారిపోయింది. కోర్టు హాలులో అధిక సంఖ్యలో లాయర్లు ఉండటంతో వారంతా జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ ముష్టియుద్ధానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఓ కేసులో బెయిల్ నిరాకరించడంతో లాయర్లు, జడ్జి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్ జిల్లా కోర్టులో  పోలీసులు, లాయర్ల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

యూపీలోని ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్‌ అసోసియేషన్‌ అధికారికి సంబంధించిన ఓ కేసులో ఈ వివాదం చోటు చేసుకుంది. పెద్ద యెత్తున వచ్చిన లాయర్లు, జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో కోర్టు రూములోని కుర్చీలను విసురుకుంటూ నానారచ్చ చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారందరినీ చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిపై ఆగ్రహించిన న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. జడ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ఆవరణలోని పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత న్యాయమూర్తులందరూ కోర్టులో పనిచేయడం నిలిపివేశారు. బార్‌ అసోసియేషన్‌ సమావేశానికి హాజరుకావాలని చర్చలకు పిలిచారు. ఈ ఘటనపై ఘజియాబాద్ అదనపు పోలీసు కమిషనర్ దినేష్ కుమార్ పి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఛాంబర్ లోపల లాయర్లు చాలా మంది ఉన్నారు. బెయిల్‌ను బదిలీ చేయాలని ఒక న్యాయవాది డిమాండ్ చేశారు. దానిని జడ్జి తిరస్కరించడం వల్ల వాగ్వాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..