AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైలు పట్టాల వద్ద రీల్స్ చేస్తున్న కుర్రకారు.. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతుల కోసం నేటి యువత పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదకర స్టంట్లు చేస్తూ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వైగంగా వస్తున్న రాలుతో టిక్ టాక్ చేసేందుకు యత్నించిన కొందరు అబ్బాయిలు లైఫ్ లో మరచిపోలేని గుణపాఠం నేర్చుకున్నారు..

Watch Video: రైలు పట్టాల వద్ద రీల్స్ చేస్తున్న కుర్రకారు.. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Bangladesh Boy Hit By Speeding Train
Srilakshmi C
|

Updated on: Oct 29, 2024 | 11:07 AM

Share

ఢాకా, అక్టోబర్‌ 29: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నేటి యువత పాకులాట రోజురోజుకీ హద్దులు దాటుతుంది. అనేక మంది ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు అబ్బాయిలు రైలు పట్టాల వద్ద టిక్‌ టాక్‌ రీల్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వెనుక వేగంగా వస్తున్న రన్నింట్‌ ట్రైన్‌తో వీరు వీడియో చిత్రించాలని అనుకున్నారు. కానీ అంతలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. వీరి వెనుక వేగంగా వచ్చిన రైలు వారిలో ఓ బాలుడిని బలంగా ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లోని షింగిమారి రైల్వే బ్రిడ్జి వద్ద టిక్‌టాక్ వీడియో రికార్డ్‌ చేసేందుకు కొందరు అబ్బాయిలు చేరుకున్నారు. వారందరి వయసు 16 యేళ్లకు మించదు. అక్కడ పట్టాలపై రైలు రావడాన్ని గమనించి వీడియో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలో వారంతా రన్నింగ్‌ రైలుకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నారు. వీడియోలో నలుగురు అబ్బాయిలు కెమెరా ముందు పోజులు ఇవ్వడం కనిపిస్తుంది. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఓ బాలుడిని బలంగాఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ వీడియోలో సదరు పిల్లల నిర్లక్ష్య ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మొబైల్‌ ఫోన్‌లో రికార్డైన ఈ భయానక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఫేమ్ కోసం ముఖ్యంగా యువత ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతున్న భయానక ధోరణిని హైలైట్ చేస్తుంది. ఈ సంఘటన యువతలో సోషల్ మీడియా పిచ్చిని కూడా అద్దం పడుతుంది. అయితే అదృష్టవశాత్తు రైలు ఢీకొన్న బాలుడికి ప్రాణాపాయం తప్పింది. గాయాలతో బయటపడ్డ బంగ్లాదేశ్ బాలుడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ మండిపడుతున్నారు. భూమిపై నూకలు ఉండటం వల్లే ఆ పిల్లాడు బతికాడని.. లేకుంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునే వాడని తిట్టిపోస్తున్నారు. ఇలాంటివి చేయవద్దని హితవు పలుకుతున్నారు. కొన్ని సెకన్ల ఆనందం కోసం ఎందుకు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదని.. సెల్ఫీలు, రిల్స్‌ కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని యువతకు బుద్ధి చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.