Andhra Pradesh: సంతలో దర్జాగా ‘మద్యం’ అమ్మకాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్! వీడియోలు వైరల్

సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో సంతలు జరుగుతుంటాయి. అయితే వీటిల్లో కూరగాయలు, పండ్లు వంటి నిత్యవసర వస్తువులను వ్యాపారులు విక్రయిస్తుంటారు. తాజాగా వీటితోపాటు కొందరు వ్యక్తులు మద్యం బాటిళ్లను బహిరంగా అమ్మడం కనిపించింది. సంతలో రంగు రంగుల మద్యం సీసాలను వరుసగా పేర్చి అమ్ముకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Andhra Pradesh: సంతలో దర్జాగా 'మద్యం' అమ్మకాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్! వీడియోలు వైరల్
Liquor Sales Open At Tanuku
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 28, 2024 | 10:42 AM

తణుకు, అక్టోబర్‌ 28: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు వైన్స్‌ షాపులలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్‌ దందాకు తెరతీశారు. ఈ క్రమంలో ఏ మాత్రం భయంలేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపు వ్యాపారులు బరితెగిస్తున్నారు. సంతలో కూరగాయలు, రోజువారీ సామాన్లే దొరుకుతాయా? అంతకుమించి ఏమీ దొరకవా? అనే రీతిలో తణుకు సంత తయారైంది. ఏకంగా మద్యం బాటిల్స్‌ సంతలోకనిపిస్తున్నాయి. ఇలా మద్యాన్ని సంతలో సరుకులా అమ్మేస్తున్నాడు ఓ యువకుడు. రంగురంగుల బాటిల్స్‌ చూసిన వారికి తొలుత ఇదేంటో అర్ధం కాలేదు. కానీ ఇవన్నీ మద్యం బాటిల్సే అని అర్థమైనవారు షాక్‌ అయ్యారు. సంతలో ఇలా బహిరంగంగా అమ్మకాలు చేపట్టడంతో కొందరు యువకులు వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంత అనే పదానికి అర్థాన్నే మార్చేశాడు ఇతడు. ఇంకా చెప్పాలంటే సంత అంటే మీనింగ్‌ని అప్‌గ్రేడ్‌ చేశాడని చెప్పుకోవచ్చు. సంతలో మత్తు సరుకు ఒక్కటే దొరకదునుకుంటే అది పొరపాటే. తణుకులోని పాతవూరు, సంత మార్కెట్‌, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తి తొలుత బేఫికర్‌గా కనిపించాడు. కానీ ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తం కాగానే, జంప్‌ అయ్యాడు. మొత్తానికి తణుకులో బహిరంగంగానే మద్యం విక్రయాలు కనిపిస్తున్నట్లు ఈ సీన్‌ చెబుతోంది. అయితే ఎక్సైజ్‌ ఆఫీసర్లు ఫోకస్‌ పెట్టగానే, ఈ బెల్ట్‌షాపు నిర్వాహకుడు పరార్‌ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయితే, నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్‌లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సంతలో ఓ చిన్న బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారుల పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు చేసి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు బైబై చెప్పిన కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం విదితమే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు
ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు
ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర
ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!