AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Mains: నేటితో ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌.. పోటీ భారీగా తగ్గే ఛాన్స్! కారణం ఇదే

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు నేటితో ముగిశాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన 7 పేపర్ల పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించింది. అయితే మెయిన్స్ కు చాలా మంది అభ్యర్ధులు గైర్హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. వారంతా ప్రిలిమ్స్ లో అర్హత సాధించినప్పటికీ కీలకమైన మెయిన్స్ పరీక్షలకు మాత్రం..

TGPSC Group 1 Mains: నేటితో ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌.. పోటీ భారీగా తగ్గే ఛాన్స్! కారణం ఇదే
TGPSC Group 1 Mains
Srilakshmi C
|

Updated on: Oct 27, 2024 | 5:00 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: పలు వివాదాల నడుమ ప్రారంభమైన తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు నేటితో ముగిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 21వ తేదీ నుంచి గ్రూప్‌ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోలీలసుతోపాటు పాటు జిల్లా కలెక్టర్లు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరిగాయి. అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు అన్ని పేపర్ల పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజైన ఈ రోజు తెలంగాణ ఉద్య‌మం, రాష్ట్ర ఏర్పాటుపై ప‌రీక్ష జ‌రిగింది. ఇక నిన్న నిర్వహించిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ పరీక్షకు మొత్తం 31,383 మందికి గానూ కేవలం 21,181 మంది మాత్రమే పరీక్ష రాశారు. అంటే 67.4 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్ధులు తెలిపారు. దీంతో ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు నానాతంటాలు పడ్డారు. ఒక్కో ప్రశ్న అర్ధం చేసుకోవడానికే 2 నుంచి 3 నిమిషాల సమయం పట్టిందని, అయినా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయామని తెలిపారు. అటు గణితం సబ్జెక్టు అభ్యర్థులు సైతం ఈ పేపర్‌ రాసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ పేపర్‌ ప్రభావం గ్రూప్‌ 1 ఎంపికపై పడుతుందని అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. మొత్తం 7 పేపర్లలో శుక్రవారం నాటి పేపర్‌ అత్యంత కఠినంగా ఉందని అభ్యర్థులు చెప్పారు. ఇక శనివారం షేక్‌పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓ అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడగా అధికారులు ఆ అభ్యర్థిని డిబార్‌ చేశారు. ఈ రోజు రాసిన పరీక్ష ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.

మొత్తంగా గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలకు సగటున 26 శాతం మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. అందువల్లనే 7 పేపర్లలో ఏ రోజున కూడా 70 శాతానికి హాజరు నమోదుకాలేదు. వాళ్లంతా కష్టపడి ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్‌కి క్వాలిఫై అయిన వాళ్లే. అయినా పరీక్షలకు భారీగా అభ్యర్ధులు డుమ్మా కొట్టారు. దీంతో గ్రూప్ 1 పోస్టులకు పోటీ తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రూప్‌ 1 ప్రశ్నాపత్రాల తరలింపులో టీజీపీఎస్సీ సరికొత్త వ్యూహం

మరోవైపు గ్రూప్‌ 1 ప్రశ్నపత్రాల ప్యాకింగ్, సీల్‌పై కూడా టీజీపీఎస్సీ వివరణ ఇచ్చింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ అన్ని ప్రశ్నాలపత్రాల ప్యాకింగ్‌ మానవ ప్రమేయం లేకుండా మిషన్‌తో ప్యాకింగ్‌ చేశామని తెలిపారు. ప్రతి పరీక్షకు పలు సెట్ల ప్రశ్నపత్రాలు సిద్ధం చేసి, అందులో ఒక దాన్ని పరీక్ష జరిగే రోజున ఎంపిక చేసి అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. పరీక్షకేంద్రం స్థాయిలో సీల్‌ వేసిన కార్టన్‌ బాక్సులను టీజీపీఎస్సీ ప్రతినిధులు, జిల్లా కలెక్టరు సమక్షంలో మాత్రమే ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ తెరిచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలు ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని కవర్లలో సీల్‌తో పంపిణీ చేశారు. అందువల్లనే ఓసారి ఎలాంటి లీకేజీలకు తావులేకుండా టీజీపీఎస్సీ పకడ్భందీగా పరీక్షలు పూర్తి చేసినట్లు పేర్కొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్