Tesla Car: టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు సజీవ దహనం! ఎక్కడంటే

అర్ధరాత్రి వేళ టెస్లా కారులో వెళ్తున్న నలుగురు భారతీయులు అనూహ్య రీతిలో కారులోనే కాలిబూడిదై పోయారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంలో నలుగురు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ కు చెందిన వారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపుచేశారు..

Tesla Car: టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు సజీవ దహనం! ఎక్కడంటే
4 Indians Killed In Canada
Follow us

|

Updated on: Oct 25, 2024 | 7:43 PM

కెనడాలోని టొరంటో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణమైన టెస్లా కారు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారా? కాదా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అసలేం జరిగిందంటే..

గోద్రాకు చెందిన కేతా గోహిల్‌ (30), నిల్‌ గోహిల్‌ (26), మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో గురువారం అర్ధరాత్రి ప్రయాణిస్తున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు టొరంటో సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం కారు బ్యాటరీకి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. రోడ్డుపై ఇతర వాహనదారులు కారులోని వారిని రక్షించేందుకు యత్నించారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. కొందరు కారు అద్దాలు పగలగొట్టి వారిని రక్షించేందుకు యత్నించారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అది ఎలక్ట్రిక్ కారు కావడంతో మంటలను ఆర్పడానికి అధిక మొత్తంలో నీరు అవసరం అయ్యాయి. మంటలను పూర్తిగా ఆర్పివేయబడిన తర్వాత, కారు బ్యాటరీ సెల్‌ను ఇసుకతో నింపి డంప్ యార్డ్‌కు తరలించామని టొరంటో ఫైర్ డిప్యూటీ చీఫ్ జిమ్ జెస్సోప్ మీడియాకు తెలిపారు.

ఈ ఏడాది జూలైలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో పంజాబ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు హైవేపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు వాహనంలో నుంచి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.