Watch: 12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్ సీన్.! వీడియో..
ఓ వైద్యుడి నిర్వాకం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో పదేళ్ల పాటు తీవ్ర ఇబ్బంది పడింది. ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె పొత్తికడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు.
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పికి కారణం కూడా వారు గుర్తించలేకపోయారు. అయితే, ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె పొత్తికడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆసుపత్రి వైద్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పొత్తికడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత బయటపడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

