AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neuroticism: సినిమాల్లో సెంటిమెంట్‌ సీన్లు చూసి ఏడ్చేవారికి పెనుముప్పు.. ఊహించని షాకిచ్చిన సైంటిస్టులు

కొందరు సినిమా చూస్తే సమయంలో అందులోని సెంటిమెంట్ సీన్లకు బలేగా కనెక్ట్ అవుతారు. సినిమాలోని పాత్రలు ఏడుస్తుంటే వీరు కూడా ఏడ్చి, ముగ్గు చీదేస్తుంటారు. ఇలా సినిమాలు చూసి అది నిజంగా జరిగినట్లు భావించి ఏడ్చే వాళ్లకు సైంటిస్టులు బాంబు లాంటి వార్త చెప్పారు. అందేంటంటే..

Neuroticism: సినిమాల్లో సెంటిమెంట్‌ సీన్లు చూసి ఏడ్చేవారికి పెనుముప్పు.. ఊహించని షాకిచ్చిన సైంటిస్టులు
Crying While Watching Movie
Srilakshmi C
|

Updated on: Oct 24, 2024 | 7:56 PM

Share

మన జీవితంలోని ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌ సోర్స్‌లలో సినిమాలు ఒకటి. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపలా టీవీ ముందు కూర్చుని నచ్చిన సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే కొందరు సినిమాలను చూసే సమయంలో అందులోని సెంటిమెంటల్‌ సీన్స్‌ చూసి ఏడ్చేవారు కూడా ఉన్నారు. అది కేవలం నటన అయినప్పటికీ సినిమాలోని సీన్‌కి తీవ్ర భావోధ్వేగానికి గురై కన్నీరు కారుస్తుంటారు. తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని వీరి పరిశోధనల్లో తేలింది.

న్యూరోటిసిజం సమస్యతో బాధపడువారిలో భయం, విచారం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. అలాగే ఒంటరితనం, ఆందోళన, చిరాకు వంటి వివిధ వివిధ భావోద్వేగాలు మనస్సు, శరీర ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. శాస్త్రవేత్తలు ఒంటరితనాన్ని అకాల మరణానికి బలమైన అంచనాగా గుర్తించారు. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారు స్వీయ-హాని, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థ వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూరోటిసిజంతో బాధపడేవారిలోని మానసిక కల్లోలం, విసుగు చెందడం వంటివి కూడా అధిక మరణాల ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. మొత్తంమీద, ఈ వ్యాధి పురుషులలో అధికంగా ఉంటుందని, 54 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో, కనీస డిగ్రీ లేనివారిలో కనిపిస్తుందని పరిశోధన బృందం కనుగొంది.

ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం యూకే బయోబ్యాంక్‌ డాటాలో ఉన్న ఐదు లక్షల మందికి చెందిన 17 ఏండ్ల జీవితాన్ని ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇది బయోలాజికల్ శాంపిల్స్, జన్యు, జీవనశైలి, అర మిలియన్ల ప్రజల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారంతో కూడిన భారీ డేటాబేస్.

ఇవి కూడా చదవండి

బయోబ్యాంక్‌లో భద్రపరచబడిన దాదాపు 500,000 మంది వ్యక్తులను 2006 నుంచి 2010 మధ్య అధ్యయనం చేసి న్యూరోటిసిజం మూల్యాంకనాన్ని సేకరించారు. అప్పటి నుంచి 17 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఈ వ్యక్తులు జీవించారా లేదా మరణించారా అనే విషయాన్ని ట్రాక్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ 17 సంవత్సరాల కాలంలో దాదాపు 500,000 మందిలో 43,400 మంది మరణించినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరి మరణానికి ప్రధాన కారణం క్యాన్సర్‌, ఆ తర్వాత నాడీ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ వ్యాధులతో మరణించినట్లు డేటా చూపించింది. ముఖ్యంగా చనిపోయిన వారందరూ అపరాధ భావన, మానసిక కల్లోలం అనుభవించారని, వారి జీవితంలో నిరంతరం ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. న్యూరోటిసిజంలోని ఇతర సమస్యల కంటే ఒంటరితనం అనేది ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని ప్రొఫెసర్‌ ఆంటోనియో టెర్రాసియానో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.