Horoscope Today: ఆర్థికంగా వారికి అనుకూల వాతావరణం.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.వృషభ రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థికంగా వారికి అనుకూల వాతావరణం.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 25th October 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 25, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక సమస్యలను జీవిత భాగ స్వామితో కలిసి పరి‌ష్కరించుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము అవసర సమయంలో అందుతుంది. ఆస్తి వివాదం కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు తమకందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొద్దిగా జాప్యం కలిగినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలకు కొరత ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొన్ని ప్రయత్నాలు, వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశిం చిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్నా చితకా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రముఖుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొందరు బంధుమిత్రుల సహాయంతో కొన్నిపనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అయితే, ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కారమై సానుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహా రాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ సభ్యుల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో కూడా శుభ వార్తలు వింటారు. చేపట్టిన పనులన్నీ సవ్యంగా కొనసాగుతాయి. ఇరుగు పొరుగుతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలను అప్పగించే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు అందు తాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలా పాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం అవసరం. ప్రయా ణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు సాదా సీదాగా సాగిపో తాయి. పోటీదార్ల సమస్యల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూ లంగా ఉంటాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇంటా బయటా అనుకూల వాతా వరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సొంత పనుల మీద శ్రద్ద పెడతారు. కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. నూతన గృహోపకరణాలు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆదాయానికి లోటుండదు. వ్యాపా రాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. అన్నదమ్ము లతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..