Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Today Horoscope(October 26, 2024): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశముంది. వృషభ రాశివారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశముంది. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈరోజు (శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 26th October 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 26, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2024): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశివారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరు బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగు తుంది. ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువులు వైభవంగా సాగిపోతాయి. ఉద్యోగం విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగు తాయి. వాహన యోగం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు ఆలోచనల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపు తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలను తెలివిగా చక్క బెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా కొన్ని నిర్ణ యాలు తీసుకుని ముందుకు వెడతారు. ఉద్యోగుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగు లకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొత్త పరిచ యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆటంకాలు, అవాంతరాలు లేకుండా పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో సవ్యంగా పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సవ్యంగా లక్ష్యా లను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచ నలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో పిల్లల వల్ల కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం పెరగడంతో చిన్నా చితకా రుణ సమస్యల నుంచి బయటపడతారు. కొత్త కార్యక్రమా లను చేపట్టి విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలను దాటి లాభాలు గడించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అవరోధాలను అధిగమించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగి, కొన్ని రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త అవకాశాలు చేతికి అందుతాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. కొన్ని సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంమంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి కీలక నిర్ణ యాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అరు దైన అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. కొందరు ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి సమసిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. బంధు మిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారాలకు మీ మీద నమ్మ కం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగ ప్రయ త్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరు గుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనపరంగా చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఆర్థిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆదాయ ప్రయత్నాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఆర్థిక విషయాల్లో ఎవరికీ తొంద రపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. ప్రారంభించిన పనులు, వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి వీలుగా కొన్ని అవకాశాలు అందుతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి