బుధ శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి ధన యోగాలు, సమస్యల నుంచి విముక్తి..!
Dhana Yogas: ఈ నెల 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు బుధ, శుక్రులు వృశ్చిక రాశిలో కలిసి ఉండబోతున్నారు. దీని వల్ల కొన్ని రాశులకు ధన యోగాలు పడుతుండగా మరి కొన్ని రాశులకు కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. బుధ, శుక్రులు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రాశులకు వీలైనంతగా చేయూతనందించడం జరుగుతుంది.
Money Astrology 2024: వృశ్చిక రాశిలో ఈ నెల 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు బుధ, శుక్రులు కలిసి ఉండడం వల్ల కొన్ని రాశులకు ధన యోగాలు పడుతుండగా మరి కొన్ని రాశులకు కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. బుధ, శుక్రులు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రాశులకు వీలైనంతగా చేయూతనందించడం జరుగుతుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి అనేక సమస్యలు, ఒత్తిళ్లు, ఆటంకాలు, వివాదాల నుంచి వీలైనంతగా విముక్తి లభించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి అష్టమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. ఆర్థిక సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరి స్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి బయటపడే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశివారికి షష్ట స్థానంలో బుధ, శుక్ర సంయోగం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు చాలావరకు అదుపులో ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు తగ్గి ఉంటాయి. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో పోటీ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించి ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. సమస్యల పరిష్కారంలో కొత్త మార్గాలను అనుసరిస్తారు.
- కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ, శుక్రుల కలయిక వల్ల ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు చేపట్టి విజయం సాధిస్తారు. రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా గరిష్ఠ స్థాయిలో లాభం పొందడం జరుగుతుంది. బంధువులతో ఆస్తి సమస్యలు, వివాదాలను చాలావరకు పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం నెరపుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు.
- ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు చాలావరకు విజయ వంతం అవుతాయి. అదనపు ఆదాయాన్ని మదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభ కార్యాల మీద కొద్దిగా ఖర్చు పెరుగు తుంది. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది. అనవసర ఖర్చుల్ని, అనవసర పరిచయాల్ని పూర్తిగా తగ్గించుకుంటారు. వ్యసనాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు.
- కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్రుల యుతి వల్ల ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రతి పని, ప్రతి ప్రయత్నం నిదానంగా పూర్తవు తాయి. ఉద్యోగంలో పని భారం నుంచి పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, రాబడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి