AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2024 Astrology: కీలక గ్రహాల అనుకూలత.. ధన త్రయోదశితో వారికి ధన యోగాలు

ఈ నెల 29న లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే ధన్ తేరస్ (ధన త్రయోదశి) రోజున కొన్ని శుభ గ్రహాలకు దిగ్బలం పడుతున్నందువల్ల ఆ రోజు నుంచి నవంబర్ 7 వరకు వారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

Dhanteras 2024 Astrology: కీలక గ్రహాల అనుకూలత.. ధన త్రయోదశితో వారికి ధన యోగాలు
Money AstrologyImage Credit source: Getty Images
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 26, 2024 | 5:00 PM

Share

ఈ నెల 29న లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే ధన్ తేరస్ (ధన త్రయోదశి) రోజున కొన్ని శుభ గ్రహాలకు దిగ్బలం పడుతున్నందువల్ల ఆ రోజు నుంచి నవంబర్ 7 వరకు వారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. గురువు, రవి, కుజుడు, శుక్రుడు, చంద్రుడు, శనీశ్వరుడి అనుకూలతల వల్ల వీరు ఆదాయపరంగా చేసే ప్రతి ప్రయత్నమూ సఫలం అవడంతో పాటు అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశిలో ధన కారకుడు, లాభస్థానాధిపతి అయిన గురువు సంచారం చేయడం, పైగా వక్రించడం వల్ల అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఏర్పడింది. సాధారణంగా కొద్ది ప్రయత్నంతో వీరి మనసులోని ఆర్థిక సంబంధమైన కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ప్రముఖుల పరిచయాల వల్ల ఉద్యోగంలో బాగా పైకి ఎదగడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం వంటివి జరుగు తాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.
  2. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ధనాధిపతి చంద్రుడి సంచారం వల్ల ధనాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ విజ యవంతం అవుతాయి. పెద్ద ఎత్తున వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. ఇల్లు, వాహనాలను సమకూర్చుకునే ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూల సమయం. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేయడానికి కూడా అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
  3. సింహం: ఈ రాశికి సప్తమంలో శని, చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల రెండు విధాలైన దిగ్బల యోగం పట్టింది. ఫలితంగా సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అప్రయత్న ధన లాభం కలుగు తుంది. ఆస్తిపాస్తుల వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
  4. తుల: ఈ రాశిలో బుధ సంచారం వల్ల, దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఆస్తి వివాదాలు పరిష్కారం అయి విలువైన ఆస్తి చేజిక్కుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. లాభదాయక ఒప్పం దాలు కుదురుతాయి. ఉద్యోగపరంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలపరంగా ఊపందుకుంటాయి. సంపద వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించడంతో పాటు దాన్ని సప్తమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టింది. రెండు శుభ గ్రహాలు, గురు, శుక్రులు పరస్పరం వీక్షిం చుకోవడం వల్ల వీరికి తప్పకుండా అప్రయత్న ధన లాభం కలుగుతుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. జీవిత భాగస్వామికి కూడా ధనపరంగా అదృష్టం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేయడానికి అనుకూల సమయం.
  6. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం కారణంగా దిగ్బల యోగం పట్టడంతో పాటు, లాభ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల అపార ధన లాభానికి అవకాశం కలిగింది. ఆదాయపరంగా చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతన సంబంధమైన ఎదుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఒకటి రెండు ధనయోగాలు పడతాయి.