Lakshmi Kataksham: శుక్రుడితో బుధుడు యుతి.. ఆ రాశుల వారికి అరుదైన లక్ష్మీ యోగం..!

Shukra - Budh Yuti: ఈ నెల 29 న బుధుడు వృశ్చికం రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఇదే రాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు యుతి చెందడం జరుగుతుంది. నవంబర్ 6 వరకూ వృశ్చికంలో ఈ కలయిక కొనసాగుతుంది. పైగా ఈ రెండు శుభ గ్రహాల మీదా గురువు దృష్టి కూడా ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శ్రీలక్ష్మీ యోగం అనే అరుదైన యోగం ఏర్పడుతుంది.

Lakshmi Kataksham: శుక్రుడితో బుధుడు యుతి.. ఆ రాశుల వారికి అరుదైన లక్ష్మీ యోగం..!
Lakshmi Kataksham
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 22, 2024 | 6:14 PM

ఈ నెల 29 న బుధుడు వృశ్చికం రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఇదే రాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు యుతి చెందడం జరుగుతుంది. నవంబర్ 6 వరకూ వృశ్చికంలో ఈ కలయిక కొనసాగుతుంది. పైగా ఈ రెండు శుభ గ్రహాల మీదా గురువు దృష్టి కూడా ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శ్రీలక్ష్మీ యోగం అనే అరుదైన యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆదాయం బాగా కలిసి రావడం, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, సుఖ సంతోషాలు కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశు లకు ఈ యోగం పడుతుంది.

  1. వృషభం: ఈ రాశిలో ఉన్న గురువుతో సప్తమ స్థానంలోని బుధు, శుక్రులకు పరస్పర దృష్టి ఏర్పడుతు న్నందువల్ల ఈ రాశివారికి పూర్తి స్థాయిలో శ్రీలక్ష్మీ యోగం ఏర్పడే అవకాశం ఉంది. తప్పకుండా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొం టాయి. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో యుతి చెందిన బుధ, శుక్రుల మీద గురువు దృష్టి పడుతున్నందు వల్ల అత్యంత అరుదైన శ్రీలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.
  3. సింహం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో గురు, శుక్ర, బుధుల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల ఈ ధన యోగం ఏర్పడింది. ఉద్యోగంలో ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు బాగా బిజీ అయిపోతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యో గం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశిలో ఉన్న బుధ, శుక్రుల మీద సప్తమ స్థానం నుంచి గురు దృష్టి పడినందువల్ల ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతోంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుద రడం, ప్రేమలో పడడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. లాభదాయక వ్యాపార, వృత్తిపరమైన ఒప్పందాలు కుదురుతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు దృష్టి లాభ స్థానంలో ఉన్న బుధ, శుక్రుల మీద పడి నందువల్ల పూర్తి స్థాయిలో శ్రీలక్ష్మీయోగం ఏర్పడింది. ఫలితంగా ఆర్థిక సంబంధమైన స్థిరత్వం లభి స్తుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు వేతనాలు కూడా పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. వారసత్వ సంపద లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగు తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్న శుభ గ్రహాల మధ్య శుభ వీక్షణ ఏర్పడినందువల్ల ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. నిరుద్యో గులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు జీతభత్యాల పరంగా మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేపట్టి బాగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు