Diwali: దీపావళి రోజున లక్ష్మీపూజ కోసం ఏ రాశి స్త్రీలు ఏ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అంటే

దేశ వ్యాప్తంగా దీపావళి పండగ సందడి మొదలైంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుగోలు చేయడం, బహుమతులు ఎంపిక వంటి అనేక రకాల పనులతో ప్రజలు బిజీబిజీగా ఉన్నారు. అయితే దీపావళి రోజున లక్ష్మీ దేవిని పుజిస్తారు. సంపదల అధిదేవతను ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ధరించే బట్టల రంగు కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ దీపావళికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే మీరు మీ రాశిని బట్టి ఏరంగు దుస్తులను ఎంచుకోవాలంటే..

Diwali: దీపావళి రోజున లక్ష్మీపూజ కోసం ఏ రాశి స్త్రీలు ఏ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అంటే
Diwali Out Fit Colours
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2024 | 4:33 PM

దీపావళి భారతీయులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ పండగను భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ఇది చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను దీపాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు. దీపావళి పండుగ లక్ష్మీ దేవి పూజకు ప్రసిద్ధి చెందింది.

  1. దీపావళి రోజున ప్రజలు ఆచారాల ప్రకారం లక్ష్మీ దేవిని, గణపతిని పూజిస్తారు, లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి.. తమ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున ప్రజలు లక్ష్మీ దేవి పూజ కోసం కొత్త బట్టలు ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోని స్త్రీలను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో దీపావళి రోజున స్త్రీలు రాశి ప్రకారం రంగుల దుస్తులను ధరిస్తే.. విశేష అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి అనుగ్రహంతో ఇంట్లో ఆనందం, శాంతి, కీర్తి వస్తుందని లభిస్తుంది.మేషరాశి: దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి మేష రాశి స్త్రీలు ఎరుపు లేదా ఎరుపు రంగుకి సంబంధించిన దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
  2. వృషభరాశి: దీపావళి రోజున వృషభ రాశి వారు లక్ష్మీదేవి పూజ సమయంలో నీలం రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజున మీరు స్కై బ్లూ లేదా రాయల్ బ్లూ వంటి నీలం రంగులో ఉండే దుస్తులను కూడా ధరించవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధనలాభం, శ్రేయస్సు పొందే అవకాశాలున్నాయని నమ్ముతారు.
  3. మిధునరాశి: మిథున రాశి వారు దీపావళి రోజున నారింజ రంగును ధరిస్తే చాలా మంచిది. నారింజ రంగు దుస్తులు డబ్బును ఆకర్షించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు దీపావళి పూజ సమయంలో ఆకుపచ్చని బట్టలు ధరించాలి. కర్కాటక రాశి వారికి ఆకుపచ్చ రంగు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు దీపావళి రోజున బ్రౌన్ కలర్ దుస్తులు ధరించాలి. ఈ రంగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
  7. కన్య రాశి: దీపావళి నాడు ఆర్థిక లాభాల కోసం, కన్య రాశి వారు తెల్లని బట్టలు ధరించాలి. అయితే పూజ కోసం పుల్ వైట్ దుస్తులు ధరించకూడదనుకుంటే.. ఇతర రంగుల కంటే ఎక్కువ తెలుపు రంగు ఉన్న దుస్తులను ఎంచుకోండి.
  8. తులారాశి: జీవితంలో శ్రేయస్సు పొందడానికి , ఆర్థిక నష్టాన్ని నివారించడానికి తుల రాశి వారు దీపావళి పూజ సమయంలో పసుపు లేదా ఈ రంగుకు దగ్గరగా ఉండే దుస్తులను ధరించాలి.
  9. వృశ్చికరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి మెరూన్ రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు చాలా శుభాలను ఇస్తుంది.
  10. ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు దీపావళి రోజున ఊదా రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం.
  11. మకరరాశి: దీపావళి రోజున మకర రాశి వారు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సంతోషాన్ని పొందడానికి నీలం రంగు దుస్తులు ధరించాలి.
  12. కుంభ రాశి: ఈ రాశి వారు దీపావళి రోజున గ్రే కలర్ దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది.
  13. మీనరాశి: దీపావళి రోజున లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి మీన రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించాలి. ఇది జీవితంలో ఆనందాన్ని తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)