Astrology: ఈ ఏడాది చివరికల్లా ఆ రాశులవారి కలలు సాకారం.. అందులో మీరాశి ఉందా..?

కలలు కనడమే కాకుండా వాటిని పట్టుదలతో నెరవేర్చుకోవడంలో కొన్ని రాశుల వారి ప్రతిభ అమోఘంగా ఉంటుంది. మరో రెండు నెలల్లో ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఐదు రాశుల వారు తమ కలలను సాకారం చేసుకోవడంలో మిగిలిన రాశుల వారికంటే ముందుంటారు.

Astrology: ఈ ఏడాది చివరికల్లా ఆ రాశులవారి కలలు సాకారం.. అందులో మీరాశి ఉందా..?
Telugu Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 21, 2024 | 6:44 PM

కలలు కనడమే కాకుండా వాటిని సాధించుకోవడంలో కొన్ని రాశుల వారి ప్రతిభ అమోఘంగా ఉంటుంది. మరో రెండు నెలల్లో ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో వృషభం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు తమ కలలను సాకారం చేసుకోవడంలో మిగిలిన రాశుల కంటే ముందుంటారు. ఈ రాశుల అధిపతుల అనుకూల సంచారాన్ని బట్టి ఈ రాశుల వారు తప్ప కుండా తమ కోరికలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారి ఆశలు, కోరికలకు అంతుండదు. ముఖ్యంగా వీరిలో ధన సంపాదన మీద కాంక్ష ఎక్కువగా ఉంటుంది. వీరు తమ ఆశలను నెరవే ర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది తెలియకపోవచ్చు కానీ, వీరిలోని పట్టు వదలని విక్రమార్కుడి లక్షణం వల్ల వీరు తమ ఆశలను, కోరికలను చాలావరకు నెరవేర్చుకునే అవకాశం ఉంది. శుక్రుడి అనుకూలత వల్ల వీరు మరో రెండు నెలల్లో భాగ్యవంతులు కావచ్చు.
  2. సింహం: ఈ రాశివారికి తమ మీద తమకు నమ్మకం ఎక్కువ. ఈ రాశికి అధిపతి అయిన రవిలో కూడా ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఓ పాలు ఎక్కువగానే ఉంటుంది. వీరు కలగన్నారంటే అది నెరవేరే వరకూ నిద్రపోరు. వీరిలో అధికారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది. రవి ప్రస్తుతం ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఉద్యోగంలో అధికారం కోసం, వృత్తి, వ్యాపారాల్లో ఆధిపత్యం కోసం, గుర్తింపు కోసం సర్వశక్తులూ ఒడ్డి ఘన విజయం సాధించే అవకాశం ఉంది.
  3. ధనుస్సు: సాధారణంగా ఈ రాశివారిలో యాంబిషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశినాథుడైన గురువు కూడా భాగ్యం, విస్తరణకు సంబంధించిన గ్రహం అయినందువల్ల కొద్ది అనుకూలతతో ఈ రాశివారి కల లను సాకారం చేసే అవకాశం ఉంది. వీరిలో సానుకూల దృక్పథం కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశివారు కలలు కనడమే కాదు, వాటిని సాధించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీరి కలలు నెరవేరి వీరి సంపద బాగా వృద్ధి చెందడం జరుగుతుంది.
  4. కుంభం: సరికొత్త ఆలోచనలు, సరికొత్త మార్పులకు మారుపేరైన కుంభ రాశివారికి భవిష్యత్తు మీదే దృష్టి ఉంటుంది. సమకాలీన పరిస్థితులకు మించిన ఆలోచనలు చేయడంలో వీరు నేర్పరులు. ఇతరు లకు భిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. పాలన, ప్రజా సంబంధాలు, సేవా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక. రాశినాథుఢు శనీశ్వరుడు ప్రస్తుతం ఇదే రాశిలో ఉన్నందు వల్ల వీరు దూరదృష్టితో వ్యవహరించి తమ ఆశలు, ఆశయాలు, కలలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.
  5. మీనం: ఈ రాశివారు సాధారణంగా ఎక్కువగా కలలు కనడం జరుగుతుంది. తమ కలలను, కోరికలను, ఆశలను నెరవేర్చుకోవడానికి వీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. సాధారణంగా వీరికి ధన సంపాదన మీద విపరీతమైన మోజు ఉంటుంది. ప్రస్తుతం రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో, అంటే ప్రయత్నానికి సంబంధించిన స్థానంలో ఉన్నందువల్ల వీరు తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశం ఉంది. వీరు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకుండా, అనుకున్నది సాధిస్తారు.