Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 22, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 22nd October 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 22, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 22, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితుల సహకారం అందుతుంది. తల్లితండ్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరించి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల కొనుగోలు మీద దృష్టి పెడతారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యో గుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యో గంలో పదోన్నతికి అవకాశం ఉంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఒక శుభ కార్యంలో కొందరు ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

పెళ్లి ప్రయత్నాల్లోనూ, ఆస్తి వివాదం పరిష్కారంలోనూ కొందరు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా పని చేస్తారు. వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. మిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మధ్యలోనే వాయిదా పడే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆర్థికంగా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం ప్రస్తు తానికి మంచిది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ వ్యయాలు సమా నంగా ఉండే అవకాశం ఉంది. బంధువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమతో గానీ కొన్ని పనులు పూర్తి కావు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటికి దూర ప్రాంత బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడ తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. బంధుమి త్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. కుటుంబ విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదా యం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆరోగ్యం పరవా లేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల విషయంలో శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో ఆర్థిక సమస్యలను, ఒత్తిళ్లను కొద్దిగా అధిగమిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల మీద ఖర్చు పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. కుటుంబపరంగా చిన్నా చితకా సమస్యలున్నా హ్యాపీగా గడిచిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం కష్టమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులకు సహాయ సహకారాలు అంద జేస్తారు. కొందరు మిత్రుల నుంచి విందు, వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి జీవితంలో విశ్రాంతి కరువవుతుంది. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!