Raja Yogam: రవికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు పట్టబోతున్నాయ్..!

అక్టోబర్ 29 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు రవి గ్రహం కొన్ని రాశుల వారి జీవితాలను నల్లేరు కాయల మీద బండిలా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తులా రాశిలో నీచబడి ఉన్న రవి..ఈ నెల 29 నుంచి నీచ భంగం చెంది, నీచభంగ రాజయోగం ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారు రాజయోగ ఫలితాలు పొందనున్నారు.

Raja Yogam: రవికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు పట్టబోతున్నాయ్..!
Raja Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 24, 2024 | 5:57 PM

ఈ నెల 29 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు రవి గ్రహం కొన్ని రాశుల వారి జీవితాలను నల్లేరు కాయల మీద బండిలా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తులా రాశిలో నీచబడి ఉన్న రవి 29 నుంచి నీచ భంగం చెంది, నీచభంగ రాజయోగం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి రాజయోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎక్కడికి వెళ్లినా రాజపూజ్యాలు లభిస్తాయి. అనేక రంగాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అప్రయత్నంగా ధనాభివృద్ధి ఉంటుంది. అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రవి వల్ల ప్రభుత్వమూలక ధన లాభం లేదా ఆస్తి లాభం కలుగుతుంది. ప్రతిభా పాటవాలకు ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్నవారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఉద్యో గంలో అధికార లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో నీచభంగం చెందినందువల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించి విజయవంతం అవు తాయి. ఉద్యోగంలో కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. తుల: ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి నీచభంగం చెందడం వల్ల నీచభంగ రాజయోగం కలిగింది. దీని వల్ల కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ప్రజ్ఞా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖు లతో పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభి స్తాయి. సిరిసంపదలు, భోగభాగ్యాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో భాగ్యాధిపతి రవి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కలుగు తుంది. తండ్రి వైపు నుంచి చర, స్థిరాస్తులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  5. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. అధికారులతో ఊహిం చని సామరస్యం ఏర్పడుతుంది. పదోన్నతికి, వేతనాలు పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం ప్రారంభం అవుతుంది. ప్రముఖులతో లాభదాయక సంబం ధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో నీచభంగం చెందడం వల్ల అకస్మాత్తుగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది అన్నివిధాలా మంచి సమయం. తీర్థ యాత్రలు చేయడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.