Horoscope Today: సంతృప్తికరంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Today Horoscope in Telugu(అక్టోబర్ 24, 2024): మేష రాశి వారు గురువారంనాడు ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (అక్టోబర్ 24, 2024): మేష రాశి వారు ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అవసర సమయాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెర గడం వల్ల విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సంతృప్తిక రంగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.. ఊహించని శుభవార్త అందు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్త వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారులు అతిగా ఆధార పడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారులకు అనేక విధాలుగా లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగానే ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కలిగిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో బాధ్యతల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపో తాయి. లాభాలకు లోటుండక పోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు సొంత బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. కొందరు సహచరుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. వృత్తి రంగాలవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకో కుండా పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. నిరుద్యో గులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారుల విమర్శలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపా రాల్లో పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందు తాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. కొందరు మిత్రుల సహా యంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం పదోన్నతికి, జీతాలు పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ధనపరంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండకపోవడం కూడా మంచిది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కుటుంబ జీవితంలో సానుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఆదాయం అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి ఇది చాలావరకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కుటుం బంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.