Lord Shani: రెండు గ్రహాలపై శని దృష్టి.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!

అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వృశ్చిక రాశిలో యుతి చెందుతున్న బుధ, శుక్రుల మీద కుంభ రాశి నుంచి శనీశ్వరుడి పూర్ణ దృష్టి పడుతుంది. ఈ మూడు గ్రహాలు మిత్ర గ్రహాలు అయినందువల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా రాజయోగ ఫలితాలనిస్తాయి. శని దృష్టి వల్ల బుధ, శుక్ర గ్రహాలు యోగదాయకంగా మారతాయి.

Lord Shani: రెండు గ్రహాలపై శని దృష్టి.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!
Lord Shani Dev
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 23, 2024 | 7:19 PM

ఈ నెల 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వృశ్చిక రాశిలో యుతి చెందుతున్న బుధ, శుక్రుల మీద కుంభ రాశి నుంచి శనీశ్వరుడి పూర్ణ దృష్టి పడుతుంది. ఈ మూడు గ్రహాలు మిత్ర గ్రహాలు అయినందువల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా రాజయోగ ఫలితాలనిస్తాయి. శని దృష్టి వల్ల బుధ, శుక్ర గ్రహాలు యోగదాయకంగా మారతాయి. మొత్తానికి ఈ మూడు గ్రహాల అనుకూలత వల్ల వృషభం, సింహం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ప్రధానమైన సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించడం, ఆదాయ మార్గాలు విస్తరించడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, ముఖ్యమైన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు అతి ముఖ్యమైన శుభ గ్రహాలు అయి నం దువల్ల వీటి మీద దృష్టి ఏర్పడడం శుభ సూచకం. ఆదాయ ప్రయత్నాల్లో ఘన విజయాలు లభి స్తాయి. వ్యక్తిగత, ఉద్యోగ, ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించని స్థాయిలో సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది.
  2. సింహం: ఈ మూడు మిత్ర గ్రహాల మధ్య యుతి, వీక్షణ ఏర్పడడం వల్ల ఉద్యోగం విషయంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, కోరుకున్న ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశం ఉంది. నిరుద్యోగు లకు విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగు తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  3. తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేసే బుధ, శుక్రుల మీద శనీశ్వరుడి దృష్టి పడడం వల్ల ఈ రాశివారికి వారం పది రోజుల పాటు కెరీర్ వైభవంగా సాగిపోతుంది. ఈ రాశికి ఈ మూడు గ్రహాలూ శుభ గ్రహాలే అయినందువల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆస్తి సమస్య పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి రావడం జరుగుతుంది.
  4. మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని లాభ స్థానంలో ఉన్న బుధ, శుక్రులను వీక్షించడం వల్ల ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశిలో ఉన్న శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్న బుధ, శుక్రులను వీక్షించడం వల్ల ఉద్యోగ పరంగా అనేక శుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి అనేక సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు లభి స్తాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు ఆర్థిక సమ స్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి