తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయకపోవడం శ్రేయస్కరం. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరు గుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి ధనయోగాలు పడతాయి.