- Telugu News Photo Gallery These 5 Qualities Women Adore in Men, Chanakya Neeti for Women and Men love and Relations
Chanakya Niti: ఇలాంటి పురుషులనే మహిళలు తెగ ఇష్టపడతారట.. మీలో ఇలాంటి లక్షణాలుంటే..
ఆచార్య చాణక్యుని ప్రకారం.. మహిళలు నిజాయితీ, కష్టపడి పనిచేసే, ప్రశాంతత కలిగిన, వారి అభిప్రాయాలను వినే, మరియు ప్రేమలో నిజాయితీగా ఉండే పురుషులను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ లక్షణాలున్న పురుషులు మహిళలకు భరోసాను కల్పిస్తారు.. వారిని గౌరవిస్తారు. చాణక్యుని నీతి శాస్త్రం ఈ లక్షణాలను విజయవంతమైన సంబంధాలకు కీలకమని సూచిస్తుంది.
Updated on: Oct 26, 2024 | 12:33 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, అపర మేథావి.. అంతేకాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన వ్యూహకర్త.. తత్వవేత్త.. దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఇలా అన్ని రంగాల్లో సత్తాచాటాడని.. ఆయన రచించిన నీతిశాస్త్రం అందుకే అంత ప్రాచుర్యం పొందిందని పేర్కొంటారు. ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. అందుకే నేటికీ ఆయన విధానాలను చాలా మంది అనుసరిస్తుంటారు. వ్యక్తిగత, వైవాహిక జీవితం మొదలుకొని.. వృత్తి, ఆరోగ్యం, ఉద్యోగం ఇలా అనేక విషయాలను ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో బోధించాడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతోపాటు ఉన్నత స్థానానికి అధిగమించవచ్చు. ఇంకా సమస్యలతో కూడా దృఢంగా పోరాడవచ్చు. అయితే.. ఆచార్య చాణుక్యుడి ప్రకారం.. కొన్ని లక్షణాలున్న పురుషులను మహిళలు చాలా ఇష్టపడతారట.. వారినే ఎక్కువగా ఆరాధిస్తారట.. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో బోధించిన ప్రకారం.. పురుషుల్లో ఇలాంటి 5 లక్షణాలను స్త్రీలు చాలా ఇష్టపడతారు. అవేంటో తెలుసుకోండి..

ఆచార్య చాణక్య ప్రకారం నిజాయితీ పరుడు, కష్టపడి పనిచేసే వ్యక్తిని స్త్రీలు చాలా ఇష్టపడతారు. అలాంటి వారికి ఉద్యోగం పట్ల అంకితభావం, జీవితంపై ఓ అభిరుచి ఉంటుందని విశ్వసిస్తారు.

ప్రశాంతంగా - జీవితం గురించి స్పష్టంగా ఉన్న వ్యక్తి వైపు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అలాంటి వారు జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. ధైర్యంగా పోరాడగలుగుతారని నమ్ముతారు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. స్త్రీలు పురుషుల ప్రవర్తనను గమనిస్తారు.. మహిళలు నిశ్శబ్దంగా తమ అభిప్రాయాలను వినే వ్యక్తిని ఇష్టపడతారు. అలాంటి వారు మహిళలను గౌరవిస్తారు.. గౌరవాన్ని పొందుతారు..

స్త్రీలు తన అభిప్రాయాన్ని సరైన మార్గంలో విని ఆచరించే వ్యక్తిగా బాగా ఇష్టపడతారు. అలాంటి వారి వల్ల తమకు ఎప్పుడూ భరోసా ఉంటుందని.. తమ నిర్ణయాన్ని ఎప్పుడైనా ఎక్కడైన వినిపించే అవాకాశం ఉంటుందని విశ్వసిస్తారు.

ప్రేమ విషయంలో నిజాయితీ గల పురుషుడు స్త్రీల పట్ల ఎప్పుడూ ఒకే విధమైన భావాన్ని కలిగి ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలు పురుషుల ప్రవర్తనను గమనిస్తారని.. మంచి ప్రవర్తన గల పురుషుల పట్ల స్త్రీలు బాగా ఆకర్షితులవుతారని పేర్కొన్నాడు.




