- Telugu News Photo Gallery Are these clothes and things hanging behind the door? Check Here is Details
Vastu Tips: తలుపు వెనుక ఈ దుస్తులు, వస్తువులు వేలాడదీస్తున్నారా.. అస్సలు మంచిది కాదు..
వాస్తు ప్రకారమే ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతూ ఉంటారు. ఇంటిని నిర్మించే విషయంలో వాస్తును తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిని నిర్మించడానికే కాకుండా ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో వాస్తు నియమం పాటించకపోతే.. కొన్ని ఇబ్బందులు తప్పవు. పక్కా వాస్తు నియమాలు పాటించకపోయినా.. ఇంట్లో చేసే కొన్ని చిన్న పనుల వల్ల వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి. వీటి వల్ల ఇంట్లో..
Updated on: Oct 26, 2024 | 9:30 PM

వాస్తు ప్రకారమే ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతూ ఉంటారు. ఇంటిని నిర్మించే విషయంలో వాస్తును తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిని నిర్మించడానికే కాకుండా ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో వాస్తు నియమం పాటించకపోతే.. కొన్ని ఇబ్బందులు తప్పవు.

పక్కా వాస్తు నియమాలు పాటించకపోయినా.. ఇంట్లో చేసే కొన్ని చిన్న పనుల వల్ల వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి. వీటి వల్ల ఇంట్లో చికాకులు, గొడవులు, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక సమస్యలు వస్తాయి.

చాలా మంది ఇంటి మెయిన్ డోర్స్ లేదంటే బెడ్ రూమ్ డోర్స్‌కి వాల్ హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల మెస్సీగా కనిపించదు అనుకుంటారు. కానీ ఇలా పెట్టడం చాలా తప్పని వాస్తు శాస్త్రం చెబుతుంది.

అదే విధంగా కొన్ని రకాల వస్తువులను కూడా తగిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పురోగతి అనేది కుంటు పడుతుందట. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీ దేవికి స్థానంగా చెబుతూ ఉంటారు. ఇలా డోర్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట.

అంతే కాకుండా ఖాళీగా ఉందని డోర్ల మీద కూడా టవల్స్, బట్టలు ఆరేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయకూడదట. ఇలాంటి చిన్న తప్పుల వలనే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు కూడా ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




